31.1 C
India
Wednesday, June 26, 2024
More

    IPL and Jagan : ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ ఓటమికి జగన్ సీఎం పదవికి లింక్ ఉందా?

    Date:

    IPL and Jagan
    IPL and Jagan

    IPL and Jagan : గత ఐపీఎల్ టోర్నీలకు మించిన ఎంటర్ టైన్ మెంట్ ను అందించింది తాజా ఐపీఎల్. అత్యధిక స్కోర్లు, సిక్సర్ల రికార్డులు..ఇలా ప్రతీ విషయంలోనూ  ఈ ఐపీఎల్ అదుర్సే అనిచెప్పాలి. అయితే చివర్లో వర్షాలతో కొన్ని మ్యాచ్ లు రద్దు కావడం..ఆ తర్వాత ఫైనల్ చాలా చప్పగా సాగడం కాస్త మైనస్ అని చెప్పాలి. ఫైనల్ లో ఎస్ఆర్ హెచ్ దారుణ ఓటమిని మూటగట్టుకోవడంతో తెలుగు ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ హెచ్ ఓటమి సంబంధిత వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇది కాస్త అటు ఇటు చేరి వేణు స్వామి మరోసారి హైలైట్ గా నిలిచారు. వేణు స్వామి పేరు బయటకు రావడంతో, ఆటోమేటిక్ గా మరోసారి జగన్ మోహన్ రెడ్డి పేరు కూడా హల్చల్ చేస్తోంది.

    ఎస్ఆర్ హెచ్ ఓనర్ కావ్య మారన్ జాతకం ప్రకారం ఈ ఏడాది ఐపీఎల్ కప్ గెలిచేది హైదరాబాద్ జట్టేనని, తాను ఒక్కసారి చెప్తే అది 100 శాతం జరిగి తీరుతుందన్న వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ ప్రారంభమైంది. ఐపీఎల్ ఫైనల్ ఇవ్వలేని ఫైనల్ కిక్కు, ఈ ట్రోలింగ్ తో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. గతంలో ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని, తెలంగాణలో కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని ఇదే వేణు స్వామి చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో కూడా వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాకు స్టఫ్ గా దొరికిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ జట్టును కావ్య మారన్ జాతకంతో పోల్చి చేసిన వ్యాఖ్యలు సందడి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో వారం రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు తేలబోతున్న నేపథ్యంలో… జగన్ మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయి తీరతారు అంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలకు ఎంత ప్రాధాన్యం దక్కిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

    అయితే వేణుస్వామి లాంటి వారు సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఏవేవో చెబుతుంటారు. వాటిని మనం నమ్మేయడం. వాటికి సంబంధించి వైరల్ చేయడం..ఫలితం వేరుగా వస్తే ట్రోల్ చేయడం ఇదంతా టేమ్ వేస్ట్ కదా అని అంటున్నారు విశ్లేషకులు. అసలు ఫలితం రాకముందే ఏవో ఊహించుకుని..ఇదే జరుగుతుంది అనే స్టేట్ మెంట్స్ ఇస్తే జనాల్లో పలుచన కావడం తప్ప పెద్దగా ఒరిగేది ఏముండదు అని వేణుస్వామి లాంటి వారికి సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Srikakulam : శ్రీకాకుళంలో రిటైర్డు హెచ్ఎం స్థలం ఆక్రమించి వైసీపీ కార్యాలయం

    Srikakulam : శ్రీకాకుళంలో వైసీపీ నాయకులు ఓ రిటైర్డు ప్రధానోపాధ్యాయుడి స్థలాన్ని...

    Pinnelli Ramakrishna : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

    Pinnelli Ramakrishna : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019...

    Shock For Kalki : కల్కి మూవీకి షాక్..హైకోర్టులో పిటీషన్ దాఖలు..ఎందుకంటే..

    Shock For Kalki : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    IAS Officer : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్!

    Dynamic IAS Officer : పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు, విమర్శలు...

    Hyper Aadi : నా పేరు ఆది.. నాది ఆంధ్రప్రదేశ్ నేను డిప్యూటీ సీఎం తాలూకా.. మళ్లీ రెచ్చిపోయిన హైపర్ ఆది

    Hyper Aadi : ఏపీ ఎన్నికల్లో విజయం తర్వాత పీపుల్స్ మీడియా...

    AP Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంను కలువనున్న తెలుగు నిర్మాతలు

    AP Deputy CM Pawan Kalyan : తెలుగు సినీ నిర్మాతలు...