Anna Lezhneva : పదేళ్ల ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాలులో కీ రోల్ గా వ్యవహరించాడు. గతంలో రెండు చోట్ల ఓటమి పాలైతే.. ఈ సారి పోటీ చేసిన ఒక్క చోట భారీ మెజారిటీతో విజయం సాధించాడు. 2014 లో టీడీపీకి మద్దతిచ్చి పోటీ చేయలేదు, 2019లో మొదటి సారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగగా.. కేవలం ఒక్కసీటు గెలుచుకున్నారు. 2024లో పోటీ చేసిన ప్రతీ చోట (21 చోట్ల) విజయం సాధించారు.
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, వ్యతిరేక ఓటును ఒడిసి పట్టుకుంటే గెలుపు నల్లేరుపై నడకే అన్న పవన్ కళ్యాణ్ పొత్తులకు తెర లేపారు. ఇక ఆ తర్వాత పరిస్థితులు మన ముందు ఉన్నవే. ఫస్ట్ సారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పీకే డిప్యూటీ సీఎం పదవి దక్కించుకోగలిగారు. ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా మారారు. ఆమె ఆస్తులకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అన్నా లెజినోవా 1980లో రష్యాలో పుట్టారు. మోడల్, నటి 2011లో ‘తీన్ మార్’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో పవన్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి సెప్టెంబర్ 30, 2013న వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్, కుమార్తె అంజనా పవనోవా ఉన్నారు.
అన్నా లెజినోవాకు భారీగానే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. లెజినోవా సింగపూర్‌లో ఒక హోటల్‌తో పాటు తన మాతృభూమి రష్యాలో కూడా కొన్ని ఆస్తులను కలిగి ఉందట. ఆమె దాదాపు రూ.1800 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో వాస్తవం ఏంటనేది తెలియదు కానీ సంబంధిత వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.