31.8 C
India
Saturday, July 6, 2024
More

    Kalki 2898 AD : కల్కి  అంతా ఓకే.. కానీ..

    Date:

    Kalki 2898 AD
    Kalki 2898 AD

    Kalki 2898 AD : వాయిదాలు పడుతూ వచ్చిన కల్కి 2829 AD థియేటర్స్ లోకి రానే వచ్చేసింది. జూన్ 26 అర్ధరాత్రి నుంచే యూఎస్ లో ప్రీమియర్స్ మొదలయ్యాయి. ఇక సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను  తెలియజేస్తున్నారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్  మేళవింపుతో నాగ్ అశ్విన్ కల్కి మూవీని తీర్చిదిద్దడం విశేషం. గతంలో ఈ తరహా ప్రయోగాలు చేసిన డైరెక్టర్లు అరుదు అనే  చెప్పాలి. అందుకే ఈ చిత్రం ఎలా ఉంటుందోనని  ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో విజువల్స్ పరంగా నాగ్ అశ్విన్ మెప్పించగలుగుతాడా? అనే సందేహంకూడా లేకపోలేదు.

    ఇక భారతీయ సినిమా గ్రాఫిక్స్ నేచురల్ ఉండదు.  మార్కెట్ కూడా  బడ్జెట్ ను పరిమితం చేస్తుంది. హై ఎండ్ టెక్నీషియన్లను ఇక్కడి నిర్మాతలు ఉపయోగించరు. రెండేళ్ల క్రితం రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్-పులి ఫైట్ గ్రాఫిక్స్ అని స్పష్టంగా తెలుస్తుంది. పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ మూవీ విషయంలో విజువల్స్ పరంగా మెప్పించడం అంత ఈజీ కాదనే విషయం గ్రహించాలి.  అయితే నాగ్ అశ్విన్ మాత్రం ఈ విషయంలో సక్సెస్ అయ్యాడని అంటున్నారు. కల్కి లో విజువల్స్ మాత్రం గ్రాండ్ గా ఉన్నాయి. ఇండియన్ సినిమాకు ఓ బెంచ్ మార్క్ క్రియేట్ అయ్యిందని  చెబుతున్నారు.
    డైరెక్టర్ నాగ్ అశ్విన్ కథ, తీర్చిదిద్దిన పాత్రలు సినిమాకు హైలెట్గా నిలిచాయి. ఇక ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనె యాక్టింగ్ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని ఆడియన్స్ చెబుతున్నారు. కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచానికి వెళ్లాలనే యువకుడిగా  భైరవ క్యారెక్టర్ లో ప్రభాస్ మెప్పించాడని, అమితాబ్, దీపికా పదుకొనె పాత్రలు సినిమాకు ఎస్సెట్ అని  సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. మహాభారతం, కృష్ణుడు కల్కి అవతారంలో తిరిగి రావడం వంటి అంశాలతో సాగే కథ కొత్తగా ఉందంటున్నారు.

    మైనస్‌లూ ఉన్నాయి..
    కల్కి మూవీలో మైనస్ లూ కూడా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. స్క్రీన్ ప్లే విషయంలో మరింత కసరత్తు చేయాల్సి ఉందని ట్వీట్ చేస్తున్నారు. పలు చోట్ల మూవీ ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదంటున్నారు. ఈ విషయంలో నాగ్ అశ్విన్ అవగాహనలేమీ కనిపిస్తుందనే టాక్ వినిపిస్తున్నది. బలమైన కథను ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పే స్కోప్ ఉన్నా పట్టించుకోలేదని పేర్కొంటున్నారు. అలాగే కొన్ని సన్నివేశాలకు  ఏ మాత్రం లాజిక్ ఉండదు. ప్రభాస్ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉందని పేర్కొంటున్నారు. ఇక మూవీ చివరి 30 నిమిషాలు మాత్రం ప్రేక్షకుడిని కట్టిపడేశాడు.  క్లైమాక్స్ అదిరిందంటున్నారు. మొత్తానికైతే కల్కి పాజిటివ్ టాక్  తెచ్చుకుంది.

    Share post:

    More like this
    Related

    Nag Ashwin : కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.. నాగ్ అశ్విన్ ఆన్సర్ ఇదే

    Nag Ashwin : కల్కి భారీ విజయంతో నాగ్ అశ్విన్ ఇండియా...

    Uttarakhand : ఉత్తరాఖండ్ లో కొండచరియలు పడి ఇద్దరు హైదరాబాదీల మృతి

    Uttarakhand : ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు హైదరాబాద్ వాసులు...

    Raj Tarun : రాజ్ తరుణ్ కేసులో ట్విస్టు.. సహజీవనం చేసింది నిజమే

    Raj Tarun : హిరో రాజ్ తరుణ్ తనను వాడుకుని మోసం...

    Ashwini Dutt : అశ్వినీ దత్ డ్యామేజ్ కంట్రోల్.. పవన్ పై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన నిర్మాత

    Ashwini Dutt  : సినిమా వేడుకల్లో, ఇంటర్వ్యూల్లో  సీనియర్ నిర్మాత అశ్వినీదత్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nag Ashwin : కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.. నాగ్ అశ్విన్ ఆన్సర్ ఇదే

    Nag Ashwin : కల్కి భారీ విజయంతో నాగ్ అశ్విన్ ఇండియా...

    Nag Ashwin : నాగ్ అశ్విన్ ఫేవరెట్ నటులు వారే.. అందులో ప్రభాస్ లేడుగా..?

    Nag Ashwin : సెంటిమెంట్ లేనిది ఏదీ నిలబడదు. అలాంటివి నమ్మం...

    Vijay – Rashmika : రౌడీబాయ్‌కి జోడీగా మరోసారి నేషనల్ క్రష్.. ఖుష్ లో ఫ్యాన్స్..

    Vijay Devarakonda - Rashmika : సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం...

    Prabhas : ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ రికార్డులు బద్దలు..

    Prabhas : కల్కి సినిమా మొదటి రోజు కలెక్షన్లు 190 కోట్ల...