![Theater Flops TV Hit Movies](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/11/prabas.png)
Theater Flops TV Hit Movies : కాలం మారుతున్నా కొద్ది జనాల థింకింగ్ ఛేంజ్ అవుతూనే ఉంటుంది. 90 దశకంలో ఓటీటీలు, టీవీ ఛానళ్లు సరిగా లేని సమయంలో థియేటర్లలో వచ్చిన సినిమాను ప్రేక్షకులు ఎగబడి చూసేవారు. సినిమాలు కూడా ఆ రకంగా సక్సెస్ అయ్యేవి. ఇప్పుడు సాధారణ ప్రేక్షకుల నుంచి అభిమానుల వరకు వే ఆఫ్ థింకింగ్ పూర్తిగా మారిపోయింది. ఏ సినిమాను ఎప్పుడు హిట్ చేయాలో.. ఎప్పుడు ఫ్లాప్ చేయాలో వారికి బాగా తెలిసిపోయింది.
ప్రజెంట్ డేస్ ఒక మూవీ థియేటర్లలో భారీ డిజాస్టర్ ఎదుర్కొంటే.. ఓటీటీల్లో భారీ హిట్ అందుకుంటుంది. ఓటీటీలలో కంటే టెలివిజన్ లో ప్రసారం అయితే మరో హిట్ అందుకుంటుంది. థియేటర్లలో హిట్టయిన ‘వాల్తేరు వీరయ్య’ టీవీల్లో ఫ్లాప్ అయ్యింది. ఇదే సమయంలో థియేటర్లలో ఫ్లాప్ అయిన ‘ఆదిపురుష్’ బుల్లితెరపై హిట్టయ్యింది.
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ‘స్టార్ మా’లో ఆదిపురుష్ మూవీని టెలీకాస్ట్ చేశారు. దీనికి ఏకంగా 9.5 (అర్బన్) రేటింగ్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీవీ రేటింగ్స్ పరంగా చూసుకుంటే ఆదిపురుష్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందన్నమాట. టెలివిజన్ లో హిట్ కొట్టడం సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఇదే సమయంలో మెన్స్ వరల్డ్ కప్ కూడా కొనసాగుతుంది. మ్యాచ్ ను కూడా ఎదుర్కొని మూవీ ఇంత రేటింగ్ సాధించడం నిజంగా ఆశ్చర్యమే.
ఈ మూవీని బట్టి చూస్తే టీవీల్లో టెలికాస్ట్ అయ్యే చాలా సినిమాలు చెప్పుకోదగ్గ రేటింగ్స్ రావడం లేదు. వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్, బ్రో, కార్తికేయ2, సర్ధార్ వంటి సినిమాలు బుల్లితెరపై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. బలగం మాత్రం భారీగానే హిట్ సాధిస్తే.. ధమాకా ఒకే అనేలా కనిపించింది. ఇప్పుడు ఆదిపురుష్ కు మంచి రేటింగ్ వచ్చింది.