32.5 C
India
Wednesday, June 26, 2024
More

    Actress Hema : నటి హేమ అరెస్టు.. ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడనుందో తెలుసా?

    Date:

    Actress Hema
    Actress Hema

    Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీలో రెడ్ హ్యాండెడ్‌గా తెలుగు నటి హేమ దొరికిన విషయం తెలిసిందే.  ఆమెకు రెండు సార్లు బెంగళూరులోని పోలీసులు నోటీసులు పంపగా.. హాజరుకాలేదు. ఒకసారి జ్వరం వచ్చిందని, మరోసారి వ్యక్తిగత సమస్యలతో రాలేనని చెప్పారు. మూడోసారి నోటీసులు పంపగా చివరకు ఆమె హాజరయ్యారు.  డ్రగ్ పార్టీ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అయితే ఆమెకు పాజిటివ్ రావడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు.

    సోమవారం బెంగళూరులో హేమ విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళుతున్న సమయంలో హేమ మాట్లాడుతూ.. రేవ్ పార్టీలో నేను లేను. కేవలం బర్త్ డే తర్వాత ఇంటికి వెళ్లిపోయాను. నేను చేసిన వీడియో కూడా హైదరాబాద్ లోనే  ఉండి చేశాను. నేను ఎలాంటి తప్పు చేయలేను కావాలనే నన్ను ఈ కుట్రలో ఇరికిస్తున్నారని హేమ వాపోయారు.

    బెంగళూరులో హేమను విచారించిన తర్వాత ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. మంగళవారం ఆమెను మళ్లీ కోర్టులో హాజరుపర్చనున్నారు. అనంతరం ఆమెను కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. కస్టడీకి అప్పగిస్తే ఆమె నుంచి నిజాలు రాబట్టే అవకాశం ఉంది.

    ఒకవేళ హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిజమైతే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చట్టాల ప్రకారం.. హేమకు మూడు సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.  అయితే తెలంగాణలో డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా పరిగణిస్తే.. కర్ణాటకలో మాత్రం దోషులుగా చూస్తారు. కర్ణాటక లో చట్టాల ప్రకారం..  డ్రగ్స్ అమ్మినా తీసుకున్నా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. హేమ న్యాయపరంగా పోరాటం చేస్తానని అసలు డ్రగ్స్ తీసుకోలేదని చెబుతోంది. తెలుగు సినీ నటీనటులు దొరికారని చెబుతున్నా.. కేవలం హేమను హైలైట్ చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్...

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bangalore Rave Party : బెంగళూరు రేవ్ పార్టీ.. విచారణకు హేమ?

    Bangalore Rave Party : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈరోజు...

    CM Revanth : ఎంత పెద్ద సెలబ్రేటీలు ఉన్నా.. వదిలిపెట్టేది లేదు..

    CM Revanth : డ్రగ్స్ కేసులో ఎంత పెద్ద సెలబెట్రీలు ఉన్నా...

    Bangalore Rave Party : బెంగళూరు రేవ్ పార్టీ.. హేమ సహా 86 మందికి డ్రగ్ పాజిటివ్

    Bangalore Rave Party : బెంగళూరు రేవ్ పార్టీ కేసు కీలక...

    Banglore Rave Party : బెంగళూరు రేవ్ పార్టీ.. తెలుగు నటికి డ్రగ్ పాజిటివ్

    Banglore Rave Party : బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో...