40.1 C
India
Friday, May 3, 2024
More

    Animal Movie Collections : బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న యానిమల్.. ఎంత వసూలు చేసిందంటే?

    Date:

    Animal Movie Collections
    Animal Movie Collections

    Animal Movie Collections : ప్రేక్షకులను థియేటర్ కు రప్పించాలంటే ఏం చేయాలో ఈ దర్శకులు  బాగా ఆలోచిస్తున్నారు. సగటు ప్రేక్షకుడు, హీరోల అభిమానులను దృష్టిలో ఉంచుకొని కథ, కథనం రాసుకుంటున్నారు. ఒకప్పుడు హాలీవుడ్ లోనే భారీ బడ్జెట్ చిత్రాలు ఉండేవి. ఇప్పుడు ఆ ట్రెండ్ ను మన దర్శకులు కొనసాగిస్తున్నారు. లవ్, యాక్షన్, డ్రామాతో పాటు అడల్ట్ సీన్లు కూడా కథ డిమాండ్ చేస్తే చిత్రాల్లో చొప్పస్తున్నారు. ఈ కోవలోకే చెందినది ‘యానిమల్’. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. మూడో వారంలోనూ అదిరిపోయే కలెక్షన్లు రాబడుతున్నది.

    మొదట్లోనే మంచి టాక్ తో..
    ఇప్పడు బాలీవుడ్ లో గతంలో కంటే భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్, డ్రామాతో పాటు కొంత అడల్ట్ సీన్లు ఉంటున్నాయి. ఇలా అయితేనే ప్రేక్షకులు చూస్తారన్న దర్శకుల ఆలోచనలకు అనుగుణంగా, కథలో భాగంగా సీన్లు రాసుకుంటున్నారు. అలా వచ్చిన చాలా చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇదే కోవలోకి ఇప్పడు ‘యానిమల్’ వచ్చి చేరింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి నుంచే మంచి టాక్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అదిరిపోతుంది. ఫలితంగా ఈ మూవీ మూడో వారంలోనూ రికార్డు కలెక్షన్లు సాధిస్తున్నది.

    మాస్ తో మెప్పించి.. కలెక్షన్లు రాబట్టి
    దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన ‘యానిమల్’ మూవీని టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించారు. భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిచారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలకపాత్రలు పోషించి చిత్రం విజయవంతం అవడంలో తమవంతు బాధ్యత నిర్వర్తించారు. ఈ చిత్రం విడుదలై 17 రోజులవుతున్నా ఇంకా కలెక్షన్ల సునామీ ఆగడం లేదు. మొత్తంగా 4 వేలకు పైగా థియేటర్లలో  రిలీజ్ చేయగా, సుమారు రూ.200 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు సమాచారం.

    ఫస్ట్ డే నుంచి పెరుగుతూ..
    ఈ మూవీ విడుదలై 17 రోజులు అవుతున్నా థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ తగ్గడం లేదు. ఫలితంగా మొదటి రోజు నుంచే కలెక్షన్లు ఊపందుకున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్నాయి. మొదటి రోజు రూ.63.80 కోట్లు, సెకండ్ డే రూ.66.27, థర్డ్ డే రూ.71.46 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత కలెక్టన్షన్లు కొంత తగ్గినా వీకెండ్ లో మాత్రం పెరుగుతున్నాయి.  ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ బిగ్ హిట్ సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన 17 రోజుల్లో 27 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇది భారతదేశ కరెన్సీలో మొత్తం రూ.224 కోట్లు. మొత్తంగా రూ.512.94 కోట్ల నెట్ వసూళ్లతో పాటు రూ.843 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబడుతూ తన సత్తా ఏంటో నిరూపించుకుంది.

    లాభం ఎంత వచ్చిదంటే?
    ఈ సినిమాకు మొత్తంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ అయ్యింది. ఇక రూ.210 కోట్ల నెట్ టార్గెట్ తో విడుదలైంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మొత్తం ఇప్పటి వరకు రూ.512 కోట్లు రాబట్టగా, హఇట్ స్టేటస్ తో పాటు అప్పుడే రూ.302 కోట్ల లాభాలను ఆర్జించింది. మున్మందు ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Yash : నిర్మాతగా మారిన యష్.. దేశంలోనే భారీ ప్రాజెక్టుతో..

    Hero Yash : కన్నడ నటుడు, కేజీఎఫ్ స్టార్ యష్ ప్రొడ్యూసర్...

    Box office : 35 కోట్ల బడ్జెట్, 50 కోట్లు కూడా రాలేదా..?  ఆ సినిమా విషయంలో ఏం జరిగిందంటే?

    Box office : యానిమల్, జవాన్, పఠాన్, గదర్ 2 లాంటి...

    OTT Movies : ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమాలేంటో తెలుసా?

    OTT Movies : సినిమాలు ఇప్పుడు ఓటీటీలో తన ప్రభావం చూపిస్తున్నాయి....

    Sandeep Vanga : ‘స్పిరిట్’కు వాటా కోరుతున్న ‘వంగా’.. ఎంత వస్తుందో తెలుసా?

    Sandeep Vanga : ‘ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు..’ అవును మరి...