28 C
India
Saturday, July 6, 2024
More

    CM Chandrababu : చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీలో మళ్లీ ఉచితంగా ఇసుక

    Date:

    CM Chandrababu
    CM Chandrababu

    CM Chandrababu : ఏపీలో అధికారం చేటప్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త అందించింది.  ఇప్పటికే సామాజిక భద్రతా పింఛన్ల పెంపు నిర్ణయాన్ని అమలు చేసిన ఏపీ ప్రభుత్వం మరో హామీ అమలుకు రెడీ అయింది. జులై 8నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రను చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాట చేసి దాని ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం సమయంలో ఉచిత ఇసుక విధానం తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు . ఆ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నెలరోజులలోపే నూతన ఇసుక పాలసీని తీసుకువస్తున్నారు.

    కొత్త ఇసుక విధానం మీద సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో.. 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన విధానాల గురించి  చర్చించారు. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాలపైన అధికారులతో చర్చించారు. వైసీపీ విధానాలతో ఏపీలో ఇసుక కొరత, ధరల భారం పెరిగిందన్న చంద్రబాబు.. నిర్మాణ రంగంలో  ఆ సమయంలో సంక్షోభం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రైవేట్ వ్యక్తులకు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించిన కారణంగా ఇసుక సరఫరా, అమ్మకాల్లో ఇబ్బందులు వచ్చాయని అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చారు.

    ఇసుక క్వారీల నిర్వహణలో లోపాలు, సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్, ఆన్ లైన్ విధానం సరిగా లేకపోవడం వల్ల అక్రమాలు జరిగిన సంగతిని సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా ఏపీలో కొత్త ఇసుక విధానం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు.. నిర్మాణ రంగానికి కొరత లేకుండా ఇసుకను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.  తాజాగా జులై ఎనిమిదో తేదీ నుంచే ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించాలంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలో ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రను ఆదేశించారు.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ పాలిట విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో

    Mahesh Babu New Movie : ఎస్ఎస్ రాజ‌మౌళి – మ‌హేష్...

    KCR : కేసీఆర్ ను వెక్కిరిస్తోన్న ఆ సెంటిమెంట్!

    KCR Sentiment : ప్రతీ ఒక్కరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఒకరికి...

    Rajarajeswara Temple : రాజరాజేశ్వర ఆలయ ఆవులు, కోడెలు పంపిణీ.. దరఖాస్తు ఇలా..

    Rajarajeswara Temple : వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కలు ఎంత...

    Naga Chaitanya : హైదరాబాద్ ను వీడనున్న నాగ చైతన్య..ఇక అక్కడే మకాం!

    Naga Chaitanya :  అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి  టాలీవుడ్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : సమాజ క్షేమం కోసం పవన్ కళ్యాణ్ సూర్యారాధన

    Pawan Kalyan : రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం డిప్యూటీ సీఎం...

    Pawan Kalyan : పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్.. ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు!

    Pawan Kalyan : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్...