33.2 C
India
Saturday, May 4, 2024
More

    English Day : పరభాషా జ్ఞానాన్ని సంపాదించు.. నీ భాషలోనె నువ్వు సంభాషించు..!

    Date:

    • ఇంగ్లీష్ డే
    English Day
    English Day

    బ్రిటిషోడు మనకిచ్చిన
    ఓ వరం..అదే శాపం..
    ఇంగ్లీష్..
    మనం వెటకారంగా
    పిలుచుకునే ఎంగిలిపీసు..
    గాడిద గుడ్డు కంకరపీసు..!

    ఎలా ఉన్నావురా..
    అనే ఆత్మీయతను మరచి
    హౌ డూ యూ డూ..
    డూడూ బసవన్న
    వరకు సాగిన
    మన ఇంగ్లీషు భాషయాత్ర..
    అదో ఘోషయాత్ర..
    మాతృభాషకు చేదుమాత్ర!
    వెధవ అనుకరణ..
    మన భాష ‘బాసు’పాలు..
    మనం అభాసుపాలు..!

    చదువుకోక ముందు కాకర..
    తర్వాత కీకర..
    ఆంగ్లం రాక మునుపు..
    అమ్మా నాన్న..
    వచ్చాక మమ్మీడాడీ..
    అలా ప్రదర్శిస్తూ
    ఓ రకం పేరడీ..
    ఆధునిక సంస్కృతీ గారడీ..!
    అత్త..పిన్ని..ఇద్దరూ ఆంటీలే
    ఇద్దరూ ఇంగ్లీషు స్టైల్లో తొడిగేది నైటీలే..
    బాబాయి..మామ..
    అందరూ అంకుల్సే..
    అన్ని పిలుపులూ
    ఇప్పుడు ఫాల్సే…!
    ఇద్దరూ నిక్కర్లే..
    తిరుమలలోనూ
    ఆ నిక్కర్లతో చక్కర్లే!

    ఏ దేశంలోనైనా పౌరులు
    మటాడేది దేశీయ భాషే..
    అలా మాటాడితే
    మనకు నామోషే..
    నమస్తే..వనక్కం..ప్రణామం
    ఈ వినయాలకు
    ఇప్పుడు పంగనామం!
    హాయ్..హాల్లో..
    బాసూ..బ్రో..
    అమ్మ భాషలో పాండిత్యం..
    ఇంగ్లీషు తప్పుల తడకగా
    మాటాడ్డమే అగత్యం..
    అనుకరణ మహత్యం..
    అదే హిపోక్రసీ
    భాషా పైరసీ
    ఇప్పుడు మన లెగసీ!

    సరే..ఇప్పుడు ప్రపంచీకరణ
    పరవళ్ళలో నిలదొక్కుకోవాలంటే
    ఇంగ్లీషు తప్పనిసరి..
    ఆ ఇంగ్లీషులో మనలో
    చాలామంది సరాసరి…
    అయినా వీసా..
    విదేశాల్లో హైలేసా..
    అంతవరకు ఓకే..
    అప్పుడప్పుడూ మాతృభూమికి
    ఓ విజిట్టు..
    బయలుదేరేపాటికే
    రిటర్న్ టికెట్టు..
    అది మర్చిపోరు..
    అమ్మ భాష మాత్రం మరుపు
    వచ్చీ రానట్టు యాస..
    ఇంగ్లీషు పాండిత్యం ప్రదర్శించే ప్రయాస..!

    రష్యన్ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా రష్యా..
    దొర ఇంగ్లీషే..
    జపనీ పనితో పాటు
    ముద్దుగా సాయొనారా..
    చైనీ చింగ్లాం చుంచుం..
    వేరే భాష పలకడం
    రాదు కొంచెం కొంచెం..
    మన దేశంలో
    భిన్న ప్రాంతాలు..
    విభిన్న భాషలు..
    మరి ఇంగ్లీషో..
    వచ్చినా రాకున్నా
    మాటాడ్డం అదో పెద్ద షో..!

    అన్నట్టు..షేక్స్ పియర్
    పుట్టిన రోజో..గిట్టిన రోజో..
    రెండూ ఒకే రోజో మరి..
    ఆయన పుట్టక మునుపూ
    ఉంది ఇంగ్లీషు..
    కాని ఆయన పుట్టాక
    భాషకు కొత్త సొగసు..
    ఆయన మనసు..
    ఆంగ్లంతో నిండిన
    అందమైన దినుసు..
    ఆ గొప్ప రచయిత పేరిటే
    ఇంగ్లీష్ డే..
    మనమూ అర్పిద్దాము
    ఆయనకో బౌ..
    మన భాషలో మంగిడీ..!

    ఎలిశెట్టి సురేష్ కుమార్
    9948546286

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NAT’S : డల్లాస్‌లో నాట్స్ తెలుగు వేడుకలు

        డల్లాస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) తెలుగు వేడుకలు మార్చి 15,16...

    MP GORANTLA MADHAV: గోరంట్ల ‘ఇంగ్లీష్’ మరీ.. చూసి నవ్వకుంటే ఒట్టు మరీ

    తేట తెలుగు తేనే లొలుకు అంటారు. మనం పుట్టింది పెరిగింది తెలుగులోనే...

    DHUBAI; దుబాయిలో తెలుగు వారి వనభోజనాలు

    దుబాయిలోని  తెలుగు వారు కార్తీక మాసంలో వనభోజనాలు చేశారు. నగరాల వారీగా,...