Wake up with Alarm : మనం రోజు పగలంతా పని చేస్తాం. రాత్రంతా నిద్రపోతాం. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే రోగాలు వ్యాపిస్తాయి. ఎప్పుడు చేసే పని అప్పుడు చేయాలి. రాత్రి పూట మేల్కొని పగటి పూట నిద్రపోవడం మంచిది కాదు. విరుద్ధంగా ఉంటుంది. అందుకే మనం రాత్రి పూట నిద్ర 7-8 గంటలు పోవాలి. సమయానుకూలంగా నిద్ర లేవాలి.
చాలా మంది సరైన సమయానికి నిద్ర లేవరు. దీంతో అలారం పెట్టుకుని లేచేందుకు మొగ్గు చూపుతారు. అది కూడా గడియారంలో అలారం పెట్టుకోరు. సెల్ లో పెట్టుకుంటారు. కానీ అలారం పెట్టుకుని లేవడం అంత మంచిది కాదు. ఇది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలా అలారం పెట్టుకోకుండా లేవడానికి ప్రయత్నిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి.
అలారం శబ్ధంతో అకస్మాత్తుగా మేల్కొవడం వల్ల బీపీ, హార్ట్ బీట్ పెరుగుతుంది. బీపీ పెరగడమే కాకుండా అడ్రినలిన్ పై ఒత్తిడి పడుతుంది. అందుకే అలారంపై ఆధారపడటం తగ్గించుకోవడం మేలు. అలారం పెట్టుకోకుండా లేస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘ కాలిక రోగాలు రాకుండా ఉంటాయి. రోజు సరైన సమయానికి నిద్ర లేచే అలవాటు చేసుకుంటే ఇబ్బందులు ఉండవు.
అలారంతో పని లేకుండా నిద్ర లేచేందుకు మన శరీరాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. అలారానికి బదులుగా సూర్యకాంతి పడే ప్రదేశంలో పడుకుంటే మనం సరైన సమయానికి నిద్ర నుంచి మేల్కొవచ్చు. ఇలా మన శరీరాన్ని ఎలా అలవాటు చేస్తే అలా తయారవుతుంది. అలారంతో అవసరం లేకుండా లేవడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి.