
Samantha Boyfriend : వయోసైటిస్ నుంచి కోలుతున్న సమంత రూత్‌ప్రభు సిటాడెల్ వెబ్ సిరీస్, ఖుషి సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె కెరీర్ పరంగా వేగంగా దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో చేసిన ఆమెకు అదే స్థాయిలో వెబ్ సిరీస్ లలో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇక లేడీ ఓరియంటెడ్ సినిమా ‘యశోద’ కూడా ఆమెకు తిరుగులేని విజయాన్ని తెచ్చిపెట్టింది. శాకుంతలం డిజాస్టర్ గానే మిగిలినా అవి ఆమెను అడ్డుకోలేకపోతున్నాయి.
ఇక ఆమె నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్ లో స్పీడ్ బాగా పెంచింది. ఇప్పటి వరకు సినియాలు, అనారోగ్యం వీటితోనే గడిపిన ఆమె పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకోలేదు. అయితే రీసెంట్ గా ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతనితో ఆమె చక్కర్లు కొడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తు్న్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఫొటోలు కూడా కనిపించాయి. నాగ చైతన్యతో డైవర్స్ అయిన తర్వాత ఆమె కొన్ని రోజులు బొమ్మరిల్లు ఫేమ్ సిద్ధార్థ్ తో డేటింగ్ చేస్తుందన్న వార్తలు వినిపించాయి. అయితే వాటిపై వారు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇక రీసెంట్ పిక్ లపై నెటిజన్లు మాత్రం భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తుందని చెప్తున్నారు. కానీ దీనిపై కూడా సమంత ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే అయితే ఏదైనా షూటింగ్ లోని పిక్ లను ఎవరైనా తీసి ఇలా పోస్ట్ చేసి ఉండవచ్చన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా వయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించాలని ఆమె ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఎక్కువ కాలం ఒంటరి జీవితం గడపడం సాధ్యం కాదని ఎవరైనా ఒకరిని పెళ్లి చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. నిజంగా సమంతకు అతను కొత్త బాయ్ ఫ్రెండ్ అయితే మరీ మంచిదని అనుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్.