31.3 C
India
Wednesday, June 26, 2024
More

    Great Andhra : అప్పుడేమో విషపు రాతలు..ఇప్పుడేమో ధీరోదాత్తుడు అంటూ పొగడ్తలు..ఏ ఎండకు ఆ గొడుగు అంటే ఇదేనేమో

    Date:

    Great Andhra
    Great Andhra

    Great Andhra : నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లి సభలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ప్ర‌మాణ స్వీకార‌ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు అగ్రనేతలు హాజరయ్యారు. ఐదేళ్ల వైసీపీ నియంతృత్వానికి చరమగీతం పాడి కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఇన్నాళ్లు అధికారంలో ఉండగా కొన్ని పత్రికలు, ఛానెళ్లు బాబును అనవసరంగా ఆడిపోసుకున్నాయి. ప్రతిరోజు ఏదో విషయాన్ని తెరపైకి తెచ్చి ఆయనను తిట్టడమే పనిగా పెట్టుకున్నాయి. మౌనంగా భరించారు చంద్రబాబు. ప్రస్తుతం ప్రజా తీర్పుతో వారు చేసినవన్నీ ఆరోపణలే అని తేలిపోయిందో వెంటనే తమ పంథాను మార్చుకుని ఆయనను కీర్తించడం మొదలు పెట్టాయి. తాజాగా సాక్షి టిష్యూ పేపర్ నుంచి పుట్టిన ‘గ్రేట్ ఆంధ్ర’ వార విష పత్రిక ‘‘సింహాసనం పై ధీరోదాత్తుడు’’ అంటూ ఓ పెద్ద కథనాన్ని వండి వార్చింది. ఎప్పుడు చంద్రబాబునాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద విషం చిమ్మే ఈ పత్రిక ఆయనను ఓ రేంజ్ లో కీర్తిస్తూ రెండు మూడు పేజీల కథనం రాసింది. దీనిని చదవిన పలువురు పత్రిక అంటే కొన్ని విలువలు ఉండాలి. ఇలా టైం చూసుకుని గోడ మీద పిల్లి లెక్కన దూకేయడం ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.

    చంద్రబాబుకు నలభై నాలుగేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన తన కెరీర్ లో ఎన్నో ఆటు పోట్లను చూసి రాటు దేలిపోయారు.  2019లో ఎదురైన పరాజయం తర్వాత.. అనేకానేక పరాభవాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయినా ఆయన అన్నింటినీ తట్టుకుని నిలబడి వైసీపీ ప్రభుత్వంతో పోరాడి 2024లో తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఆయనలో సహనం, సంయమనం, దృఢమైన సంకల్పం,  అనాలోచిత నిర్ణయాలు తీసుకోకపోవడం.. ఇవన్నీ చంద్రబాబును చెక్కుచెదరని ఉక్కుమనిషిగా నిలబెట్టాయి. ఆయన వ్యక్తిత్వ లక్షణాలే తిరిగి ప్రజల నమ్మకాన్ని చూరగొనేలా, ఆయనకు మళ్లీ సీఎం పీఠం దక్కేలా చేశాయి. ఈ అయిదేళ్లలో ఎన్నో అవమానాలను ఆయన దాటారు. వేధింపులను ఓర్చుకున్నారు. తిరిగి తనను తాను రాష్ట్రఅభివృద్ధికి పునరంకితం చేసుకోగలిగారు.

    అలాంటి చంద్రబాబుపై గత ఐదేండ్లలో గ్రేట్ ఆంధ్ర రాసిన రాతలు ఏవగింపు కలిగించేవే. ఇక బాబు అధికారంలోకి రావడంతో ఏదో బుజ్జగింపు కథనాన్ని రాసి కాకా పడుదామంటే తెలుగు తమ్ముళ్లు ఊరుకోరు కదా. తాజాగా రాసిన కథనంలోనూ అక్కడక్కడ వ్యంగ్యపు పాళ్లు ఎక్కువే ఉన్నాయి. పైకి చంద్రబాబుకు పాజిటివ్ వార్తే అనిపించినా అంతర్గతంగా తన మార్క్ విషపు వ్యంగం ఉండనే ఉంది.

    Share post:

    More like this
    Related

    Kalki 2898 AD : ఆ ముగ్గురిదే సినిమా అంతా..

    Kalki 2898 AD : బాహుబలి సిరీస్ తర్వాత  హిట్టు ఫ్లాపులతో...

    America : అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి

    America : అమెరికా లాస్ వెగాస్ లో ఓ అపార్ట్ మెంట్...

    TV-9 Rajinikanth : ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయికి దిగజారిపోయిన టీవీ- 9 రజనీకాంత్

    TV-9 Rajinikanth : జర్నలిస్టు రజనీకాంత్ అంటే గుర్తు పట్టరేమో కానీ.....

    Corporate culture For Funerals : అంత్యక్రియలకు కార్పోరేట్ కల్చర్.. డబ్బులిస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు

    Corporate culture For Funerals : నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Aravind : ‘పవన్ మా వాడు’ అంటున్న అల్లు అరవింద్.. అప్పుడలా ఇప్పుడిలా..?

    Allu Aravind : ‘బెల్లం చుట్టూ ఈగలు’ సామెత అక్షర సత్యం....

    Ramoji Rao : రామోజీరావు సంస్మరణ సభను భారీగా నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం

    Ramoji Rao : మీడియా మొఘల్  రామోజీరావు గురించి ఎంత చెప్పుకున్నా...

    YS Jagan : జగన్ కు భారీ షాక్.. నిబంధనలు విస్మరిస్తే అంతే..!

    YS Jagan : చంద్రబాబు సర్కార్ మాజీ సీఎం జగన్ కు...