BigBoss Sohel : సినిమా అంటేనే రంగుల కల. అందులో చెప్పేదొకటి. చేసేదొకటి. దేనికి పొంతన ఉండదు. ప్రెస్ మీట్ అని చెప్పి సమయానికి రారు. ఉదయం 10 గంటలకు అన్న మీట్ ఎప్పుడో మధ్యాహ్నానికి పెడతారు. ఇలా క్రమశిక్షణ సినిమావాళ్లకు తక్కువగానే ఉంటుంది. పెద్ద సినిమా హీరో అయితే ఇంకా సమయానికి పొంతనే ఉండదు. ఇలా సినిమా వాళ్ల ప్రోగ్రామ్ ల నిర్వహణ కత్తి మీద సామే అని చెప్పుకోవాలి.
ప్రతి సందర్భంలో సినిమా వాళ్ల తీరు వివాదంగానే ఉంటుంది. మొన్న బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ కామెంట్ చేశాడు. మీడియా వాళ్ల సమావేశాలు అంటే వాటికి సమయం, సందర్భమే ఉండదని చెప్పడం గమనార్హం. ఈ కామెంట్ పై కూడా పలు రకాల చర్చలు నడిచాయి. దీనిపై చాలా మంది కూడా ప్రస్తావించారు. సినిమా వాళ్ల తీరుపై తమదైన శైలిలో విమర్శలు చేయడం పరిపాటే.
ఇక ఈవెంట్లలో విషయానికి బదులు ప్రవచనాలు చెబుతుంటారు. సినిమా గురించి చెప్పకుండా భక్తికి సంబంధించిన ముచ్చట్లు వల్లిస్తుంటారు. ఇలా యాంకర్లు, జర్నలిస్టులు, మీడియా కోఆర్డినేటర్ల ను బలి చేస్తుంటారు. ఈ పరిస్థితి మీడియా వారిని కష్టాల పాలు చేసేందుకే అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇప్పటికైనా సినిమా వాళ్లు మారరా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.