Upasana Birthday :
మెగా కోడలు ఉపాసన పుట్టిన రోజు వేడుకలు ఈ రోజు ఘనంగా జరుగుతున్నాయి. రాంచరణ్, ఉపాసన 11 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి జూన్ 20న ఓ పాప జన్మించింది. ఆమె పేరు క్లీన్ కార అని పేరు పెట్టారు. ఈ పేరు లలిత సహస్ర నామాల్లో నుంచి తీసుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఉపాసనకు రాంచరణ్ మంచి బహుమతి ఇవ్వనున్నారు.
రాంచరణ్ ఉపాసన 2012లో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. జూన్ 20న ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జూన్ 30న బారసాల నిర్వహించారు. తన కుమార్తె జననం కోసం ఆస్పత్రిలో రాంచరణ్ రూ. 1.50 కోట్లు ఖర్చు చేశాడట. అర్ధరాత్రి ఆమెకు డెలివరీ చేశారు. అల క్లీన్ కార జననం జరిగింది.
అపోలో ఆస్పత్రి డైరెక్టర్ గా ఉపాసన బిజీగా ఉంది. ఆమె ఆస్తి విలువ దాదాపు రూ. 10 వేల కోట్లు అని తేలింది. ఇలా ఆమె వ్యాపార లావాదేవీలతో పాటు కుటుంబాన్ని కూడా చూసుకుంటోంది. చరణ్, ఉపాసన పదేళ్లు పిల్లలు వద్దనుకున్నారు. తరువాత పదకొండో ఏట ప్లాన్ చేసుకుని సక్సెస్ అయ్యారు. ఇలా క్లీన్ కార పుట్టింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి ఉపాసన మంచి బహుమతి ఇచ్చింది.
క్లీన్ కార కోసం రూ. కోట్లు ఖర్చు చేసి ప్రత్యేకంగా గది ఏర్పాటు చేశారు. గది ఏర్పాటులో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్స్ కృషి చేశారు. తల్లి అయ్యాక ఉపాసన జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు కావడంతో మెగా కుటుంబ సభ్యులు ఉపాసన బర్త్ డే ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ సందర్భంగా ఉపాసనకు ఖరీదైన బహుమతి ఇవ్వనున్నాడని చెబుతున్నారు.