32.5 C
India
Wednesday, June 26, 2024
More

    Minister Sridhar Babu : తెలంగాణ ప్రవాసుల కోసం ప్రత్యేక బోర్డు.. మంత్రి దుద్దిళ్ల హామీ

    Date:

    Minister Sridhar Babu
    Minister Sridhar Babu

    Minister Sridhar Babu : తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’కు ఆయన హాజరై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు.

    ప్రవాసులు పుట్టిన ఊరుకు మేలు చేసేలా గ్రామ పురోగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేరళలో ప్రవాసుల సంక్షేమ బోర్డు విజయవంతంగా నడుస్తుందని అంతకన్నా గొప్పగా త్వరలో ‘తెలంగాణ ప్రవాస భారతీయుల సంక్షేమ బోర్డు’ ఏర్పాటు వస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

    పెద్దపల్లి జిల్లాలో త్వరలో 1000 కోట్లతో కోక కోలా మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదరిందని వివరించారు శ్రీధర్ బాబు. పరిశ్రమలు కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ విస్తరణకు తమ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని వివరించారు.

    గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మీట్ అండ్ గ్రీట్లో చైర్మన్ విశ్వేశ్వర్ కలవల, సురేష్ రెడ్డి, ట్రెజరర్ ముద్దసాని సుధీర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నంది సమరేంద్ర, వాషింగ్టన్ డీసీ విభాగం ఉపాధ్యక్షులు కోట్య బానోత్, ముండ్రాతి రాము, ఎగ్జిక్యూటివ్ కమిటీ టీం సునీల్ కుడికాల, మధు యనగంటి తదితరులు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్...

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : రైతులకు రేవంత్ శుభవార్త.. ఇప్పుడిక చేతి నిండా డబ్బే..!

    CM Revanth : తెలంగాణ జొన్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త...

    CM Revanth : రేవంత్ ‘మార్పు’ మొదలైనట్లేనా?

    CM Revanth : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొన్నటి...

    Government Advisers : ప్రభుత్వ సలహాదారుల నియామక ఉత్తర్వులు

    Government Advisers : తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా పలువురు నియామకం అయ్యారు....

    Meet and Greet : లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడితో మీట్ అండ్ గ్రీట్.. అమెరికాలో ఎప్పుడంటే?

    Meet and Greet : అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సంస్థలు...