31.2 C
India
Thursday, July 4, 2024
More

    Air Europe Flight : విమానంలో అల్లకల్లోలం.. సీట్లలోని వారు ఎగిరిపడ్డారు

    Date:

    Air Europe Flight
    Air Europe Flight

    Air Europe Flight : స్పెయిన్ లోని మాడ్రిడ్ నుంచి ఉరుగ్వే వెళుతున్న ఎయిర్ యూరప్ ఫ్లయిట్ గాల్లో భారీ కుదుపులకు గురైంది. బ్యాలన్స్ తప్పి అటూ ఇటూ ఊగిపోయింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఎగిరిపడ్డారు. కొందరు ప్రయాణికులు తమ సీట్ల నుంచి ఎగిరి లగేజీ బాక్సుల్లో పడ్డారు. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లగేజీ బాక్సుల్లో పడిన ప్రయాణికులు కిందకు దిగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    విమానం భారీ కుదుపులకు లోనవడంతో ఉరుగ్వే వెళ్లాల్సిన ఫ్లయిట్ ను పైలెట్లు దారి మళ్లించి బ్రెజిల్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం ఒక్కసారిగా క్షణాల్లోనే వేగంగా కిందకు దిగిందని, ఆ వెంటనే మళ్లీ అత్యంత వేగంగా పైకి లేచిందని, అటూ ఇటూ ఊగిపోయిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణాలు ఏంటీ అనేది ఎయిర్ యూరప్ సంస్థ స్పష్టం చేయలేదు. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. బ్రెజిల్ లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, గాయపడిన 30 మంది ప్రయాణికులకు చికిత్స అందిస్తున్నట్లు ఎయిర్ పోర్టు అథారిటీ వెల్లడించింది.

    Share post:

    More like this
    Related

    World Champions : విజయ యాత్రకు సిద్ధమైన వరల్డ్ చాంఫియన్లు

    World Champions : టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత క్రికెట్...

    Sivaji Raja : డబ్బుల విషయంలో బ్రహ్మానందంతో గొడవ.. పరిటాల రవి రమ్మన్నారంటూ  ఫోన్.. బయటపెట్టిన శివాజీరాజా

    Sivaji Raja : తెలుగులో చిన్న చిన్న పాత్రలతో  కెరీర్ ప్రారంభించి...

    Panipuri : షాకింగ్ న్యూస్.. పానీపూరీలో క్యాన్సర్ కారకాలు

    Panipuri : మీకు పానీపూరీ అంటే ఇష్టమా..? ప్రతిరోజూ పానీపూరీ తినే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hyderabad : హైదరాబాద్-కౌలాలంపూర్ విమానంలో సాంకేతిక సమస్య.. 3 గంటలు గాలిలోనే చక్కర్లు

    Hyderabad-Kuala Lumpur Flight : హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా...

    Amazon Forest : అమెజాన్ అడవుల్లో అత్యాధునిక నగరం? బయటపడ్డ ఆధారాలు ఏం చెప్తున్నాయంటే?

    Amazon Forest : భారీ అడవుల గురించి ప్రస్తావన వస్తే మొదట...

    Special story : పాముల దీవి అదీ.. అక్కడికెళితే తిరిగిరారు.. స్పెషల్ స్టోరీ

    Special story :  పాములంటే అందరికి భయమే. వాటిని చూస్తే పరుగెడతాం....

    విడాకులు వచ్చాయనే ఆనందం.. అంతలోనే విషాదం..

    Bungee jump: సాధారణంగా విడాకులు రావడమంటే వట్టిమాటేం కాదు. ఏళ్లకు ఏళ్లు...