40.1 C
India
Friday, May 3, 2024
More

    Prevent White Hair : జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Date:

    Prevent White Hair
    Prevent White Hair

    Prevent White Hair : వయసు పెరిగాక జుట్టు తెల్లబడటం సహజమే. కానీ ప్రస్తుతం చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ముప్పై ఏళ్లకే జుట్టు తెల్లగా మారుతుండటంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. చిన్న వయసులోనే జుట్టు నెరవడంతో నలుగురిలో తిరగలేకపోతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. జన్యుపరమైన లోపాలు, కాలుష్యం, లైఫ్ స్టైల్ వంటి వాటి వల్ల జుట్టు తెల్లగా మారుతుందని చాలా మందికి తెలిసినా ఏం చేయలేని పరిస్థితి.

    ఇటీవల కాలంలో ప్రతి వారికి ఒత్తిడి పెరుగుతోంది. అది చదువు కానీ ఉద్యోగం కానీ ఒత్తిడితో కూడుకుంటోంది. దీంతో మానసిక ఆందోళన అధికమవుతోంది. దీని వల్ల మెలనిన్ వర్ణద్రవం ఉత్పత్తి తగ్గి జుట్టు తెల్లగా మారుతుంది. ఒత్తిడిని కంట్రోల్ లో ఉంచుకోకపోతే కష్టమే. ధ్యానం, శ్వాస, వ్యాయామాలు, సంగీతం వంటివి వింటూ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మంచిది.

    పోషకాహార లోపం కూడా జుట్టు తెల్లబడటానికి కారణంగా నిలుస్తోంది. బి12, పోలిక్ యాసిడ్, విటమిన్ సి, ఇ, జింక్, కాపర్, ఐరన్ వంటి పోషకాల వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు నెరిసిపోతుంది. ఈ సమస్య ఉన్న వారు విటమిన్ ఎ ఉండే ఆకుకూరలు, పసుపు రంగు పండ్లు, విటమిన్ బి ఉండే పెరుగు, టమాటా, కాలీఫ్లవర్, చిరుధాన్యాలు, అరటి, వాల్ నట్, బాదం, గుమ్మడి వంటివి తీసుకోవడం ఉత్తమం.

    పొగ తాగడం అలవాటు ఉంటే జుట్టు నెరుస్తుంది. పొగలోని హానికరమైన రసాయనాలు జుట్టు కుదుళ్లను పాడు చేస్తాయి మెలనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తాయి. అల్కహాల్ తీసుకుంటే కూడా జుట్టు తెల్లబడుతుంది. విటమిన్లు, మినరల్స్ అందించేలా ఆహారాలు ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

    నిద్రలేమి కూడా జుట్టు తెల్లబడటానికి కారణమవుతుంది. రోజుకు కనీసం 7-8 గంటలైనా నిద్ర పోవడం మంచిది. పర్యావరణ సమస్య కూడా జుట్టు తెల్లబడేలా చేస్తుంది. శారీరక శ్రమ లేకపోతే కూడా జుట్టు తెల్లబడుతుంది. వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇలా జుట్టు తెల్లబడకుండా చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

    Share post:

    More like this
    Related

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    White hair black : తెల్ల జుట్టును నల్లగా చేసే మొక్క ఇదే..

    White hair black : ఆయర్వేదంలో గుంటగలగర ఆకుకు ఎంతో ప్రాధాన్యం...