27.4 C
India
Friday, June 21, 2024
More

    Weight Lose : బరువు తగ్గేందుకు ఏది బెటర్.. మెట్లు ఎక్కడమా? వాకింగ్ చేయడమా?

    Date:

    Weight Lose
    Weight Lose

    Weight Lose : మారుతున్న జీవినశైలి, తగ్గిన శారీరక శ్రమ, ఆహారం అలవాట్లు ఇవన్నీ కలిసి అధిక బరువుకు దారి తీస్తున్నాయి. ఇంకే ముంది అధిక బరువుతో డయాబెటిస్, గుండెపోటు తదితర ఇతర వ్యాధులు పొంచి ఉన్నాయి. అయితే అధిక బరువు తగ్గడానికి (వెయిట్ లాస్) కు వివిధ రకాల వ్యాయామాలు చేస్తూ, కఠినమైన డైట్ ను ఫాలో అవుతూ ఉంటాం. ఇక వ్యాయామాల్లో చాలా రకాలు చేస్తుంటారు. వాకింగ్ అనేది అధిక బరువును తగ్గించడంతో పాటు ఇతర వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. అయితే కొందరు స్టెప్స్ లాంటివి కూడా ఎక్కుతూ అధిక బరువు తగ్గించుకుంటారు. మరి వాకింగ్, స్టెప్స్ ఎక్కడం ఏది బెటర్..

    మెట్లు ఎక్కడం వల్ల..
    ఈ వ్యాయామం ద్వారా తొడలు, కాళ్లలోని కొవ్వు కరుగుతుంది, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగించవచ్చు. మెట్లు ఎక్కడ వల్ల వాకింగ్ కంటే మూడు రెట్లు వేగంగా ఫ్యాట్‌ బర్న్‌ అవుతుందట. త్వరగా బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుందట. 2001లో ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌’లో ప్రచురించిన కథనం ప్రకారం.. అధిక బరువుతో బాధపడేవారు మెట్లు ఎక్కడం వల్ల తగ్గే అవకాశం ఉందని గుర్తించారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ డేవిడ్ జే లెవి ఉన్నారు.

    గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..
    మెట్లు ఎక్కడం వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీని ద్వారా రక్త ప్రసరణ పెరిగి గుండెకు మంచి వ్యాయామం కలుగుతుంది. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు మెట్లు ఎక్కడం మంచిది కాదని.. హైబీపీతో బాధపడేవారు కూడా వైద్యుల సూచనలతో మెట్లు ఎక్కాలని సూచిస్తున్నారు.

    మానసిక స్థితి మెరుగుపరుస్తుంది..
    వ్యాయామం చేయడం ద్వారా ఎండార్ఫిన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మానసిక స్థితి మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడంలో సాయం చేస్తుంది. అలాగే మెట్లు ఎక్కడం వల్ల ఆందోళన, నిరాశ తగ్గుతాయని చెబుతున్నారు.

    నడక వల్ల లాభాలు..
    ఎవరైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఈజీగా చేయగలిగే వ్యాయామం నడక మాత్రమే.  రోజూ ఉదయాన్నే ఒక అరగంట నడవడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

    కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది..
    శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ కరిగించుకునేందుకు నడక మంచి ఎక్సర్‌సైజ్‌. ప్రతి రోజూ అరగంటకు పైగా నడవడం వల్ల కొవ్వు కరిగించుకోవచ్చు.  ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే వివిధ రకాల గుండె సమస్యలతో బాధపడుతున్నారు. రోజూ నడవడం వల్ల గుండె ఆరోగ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2018 పీర్‌ జర్నల్‌లో నివేదిక ప్రకారం.. వాకింగ్‌ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని.. బీపీ అదుపులో ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.

    ఒత్తిడి తగ్గుతుంది..
    ఉదయాన్నే నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళన సమస్యలు తగ్గుతాయి. వాకింగ్‌ వల్ల మైండ్‌ రిలాక్స్‌ అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇవే కాకుండా వాకింగ్ వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

    ఏది బెటర్..
    అధిక బరువు తగ్గేందుకు వాకింగ్ లేదా మెట్లు ఎక్కడం ఏది బెటర్ అని నిపుణులను అడిగితే రెండు కూడా మంచివేనని చెప్తున్నారు. కానీ వారి ఫిట్‌నెస్ బరువు స్థాయిని బట్టి ఒకటి కొంచెం, మరోటి ఇంకొంచెం బెటరని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అధిక బరువుతో ఉన్నవారు ఫస్ట్ కొంత వాకింగ్, డైటింగ్ వల్ల తగ్గించి తర్వాత మెట్లు ఎక్కాలి.. లేదంటే మోకాళ్లపై అధిక భారం పడి ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది. ఆరోగ్యంగా, బీఎంఈ రేట్ సరిపోయేంతగా  ఉన్నవారు వాకింగ్‌, మెట్లు ఎక్కడం వంటి రెండు వ్యాయామాలను చేయవచ్చని సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    PM Modi : 2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా: పీఎం మోదీ

    PM Modi : విదేశాల్లోనూ యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని...

    Deputy CM Pawan Kalyan : అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు

    Deputy CM Pawan Kalyan :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  సమావేశాలు నేడు...

    Priyanka Chopra : ప్రియాంక చోప్రా రెస్టారెంట్ క్లోజ్.. అసలేమైందంటే

    Priyanka Chopra Restaurant : ప్రియాంక చోప్రా బాలీవుడ్ ను దాటి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Health Tips : ఇవి తింటే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ బాగుంటుందట..!

    Health Tips : ఉలవలు మంచి ఆహారం. ముఖ్యంగా పురుషులకు మరింత...

    Sleeping Positions : ఎటువైపు తిరిగి నిద్రపోతే మంచిది.. రెండు వైపుల పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

    Sleeping Positions : రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా నిద్ర కూడా...

    Knee Pains : మోకాళ్ళ నొప్పులా.. అయితే ఈ ఒక్కటి పాటిస్తే చాలు నడవలేని వారి సైతం లేచి పరిగెత్తాల్సిందే?

    Knee Pains : ప్రస్తుత రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల...

    Curry Leaf Harvest : ఆధునిక సేద్యానికి, వైద్యానికి – కాసుల ‘వంట’ కరివేపాకు ‘పంట’

    Curry Leaf Harvest : భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్‌గా కనిపిస్తుంది. చాలా...