32.5 C
India
Wednesday, June 26, 2024
More

    BRS New Chief : బీఆర్ఎస్ కు కొత్త రథ సారథి?

    Date:

    BRS New Chief
    BRS New Chief

    BRS New Chief : తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ పార్టీ భవిష్యత్తు పై సరికొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటి వరకు రాష్ట్రం ఏర్పడే నాటి వరకు కూడా ఉద్యమ సారధిగా కేసీఆర్ ఉన్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా పార్టీ పగ్గాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొడుకు కేటీఆర్ కొనసాగుతున్నారు. పదేళ్లు తిరుగులేని విదంగా తండ్రి కొడుకులే పార్టీ, పరిపాలన బాధ్యతల్లో ఉన్నారు. పదేళ్ల తరువాత ప్రజల నుంచి వ్యతిరేకత తప్పలేదు. పార్టీ విజయావకాశాలను ఇన్నేళ్ళపాటు కేసీఆర్ ముద్దాడారు. రాష్ట్రంలో అధికారం పోయింది. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పార్టీ ఉనికిని చాటుకుంటుందని కేసీఆర్ ఆశించారు. కానీ ఆ ఆశలు అడియాశలు అయ్యాయి.

    ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్తుపై కేసీఆర్ దీర్ఘాలోచనలో పడ్డట్టు సమాచారం. ప్రతిపక్ష నేతగా కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లడంలేదు. నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్లారు. అయన మౌనంగా ఉన్నాడంటే ఎదో ఒక గట్టి నిర్ణయంతోనే  బయటకు వస్తారని పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రావాలంటే మరో నాలుగున్నరేళ్ల సమయం ఉంది. అంటే ఎన్నికలకు ముందు ఆరునెలల కాలం కసరత్తుకు అవసరం. ఇంకా నాలుగు ఏళ్ల పాటు పార్టీ అధ్యక్ష భాద్యతలను మరొకరి భుజాన ఎత్తడానికి ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

    పార్టీ నిర్మాణం చేపట్టి ఉద్యమం ఆరంభించిన నాటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ కుటుంబ సభ్యులు పార్టీలో చేరారంటే హరీష్ రావ్ తరువాత వచ్చినవారే ఇప్పుడు ఉన్నవారంత. ఇప్పుడు పార్టీ అధ్యక్ష భాద్యతల నుంచి తప్పుకొని హరీష్ రావ్ కు అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అదేవిదంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ను కూడా భాద్యతల నుంచి తప్పించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలిసింది.

    పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకున్న తరువాత కేసీఆర్ నిశ్శబ్ద వాతావరణంలోనే కొనసాగుతున్నారు. పార్టీ తిరిగి పాత వైభవం చాటుకోడానికి కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లపై వేసే ఎత్తుగడలు ఏమిటో వేచిచూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....

    PM Modi – Rahul Gandhi : పీఎం మోదీ – రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్

    PM Modi - Rahul Gandhi : లోక్ సభ స్పీకర్...

    Cheetah : శంషాబాద్ లో చిరుత సంచారం.. సీసీ కెమెరాలతో నిఘా

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ లో చిరుత సంచారం కలకలం...

    Aarogyasri Card : ఏపీ లో ఆరోగ్య శ్రీ కార్డుపై కీలక అప్‌డేట్

    Aarogyasri Card Update : సీఎం క్యాంపు ఆఫీస్ (సీఎంసీఓ) పేరుతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : విద్యుత్‌ కమిషన్‌పై హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌

    KCR : తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం...

    Gajwel and Siddipet : గజ్వేల్, సిద్దిపేట కేసీఆర్ గౌరవాన్ని కాపాడగలవా?

    Gajwel and Siddipet : పార్లమెంట్ ఎన్నికలకు చివరి దశ పోలింగ్...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...