31.1 C
India
Wednesday, June 26, 2024
More
    Home Blog Page 1526

    55 ఏళ్ల వయసులోనూ గ్లామర్ తో అదరగొడుతున్న భామ

    senior actress seetha glamour dose at age of 55
    senior actress seetha glamour dose at age of 55
    senior actress seetha glamour dose at age of 55
    senior actress seetha glamour dose at age of 55

    55 ఏళ్ల వయసులో కూడా గ్లామర్ తో అదరగొడుతోంది సీత. 80 – 90 వ దశకంలో హీరోయిన్ గా నటించిన ఈ భామ తెలుగు , తమిళ్ , మలయాళ , కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో ఈ భామను పార్తీపన్ హీరోయిన్ గా పరిచయం చేసాడు. దాంతో కొన్నాళ్ల తర్వాత పార్తీపన్ – సీత పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు కాపురం బాగానే జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా. అయితే కాపురంలో కలతలు చెలరేగడంతో విడాకులు తీసుకున్నారు.

    ఆ తర్వాత కొన్నాళ్ళకు ఓ సీరియల్ నటుడ్ని పెళ్లి చేసుకుంది. అయితే ఆ పెళ్లి కూడా పెటాకులే అయ్యింది. ఇప్పుడు తల్లి , అత్త పాత్రల్లో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. నటనకు అంతగా ప్రాధాన్యమున్న పాత్రలు లభించకపోవడంతో నటన పరంగా సంతృప్తి లేకపోయిందట. అయితే తనకు 55 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ గ్లామర్ ను ప్రదర్శించడంలో ఎలాంటి వెనకడుగు వేయడం లేదు ఈ భామ. అందంగా ముస్తాబు అవుతూ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో తన ఫోటోలను , వీడియోలను పెడుతూ కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తోంది. 

    సీబీఐ కి ఝలక్ ఇచ్చిన కవిత

    Kavitha given shocking to CBI
    Kavitha given shocking to CBI
    Kavitha given shocking to CBI
    Kavitha given shocking to CBI

    కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కి ఝలక్ ఇచ్చింది ఎమ్మెల్సీ కవిత. ఈనెల 6 న నేను సీబీఐ కి అందుబాటులో ఉండటం లేదని, దానికి బదులుగా ఈనెల 11, 12 , 14 , 15 తేదీలలో ఏదో ఒక రోజు ఎంచుకోవాలని అలాగే ఈ విషయాన్ని త్వరగా నిర్ణయించాలని సీబీఐ ని కోరింది కవిత. 

    తాజాగా సీబీఐ కు మరో లేఖ రాసింది కవిత. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన అనంతరం కవిత తన నిర్ణయాన్ని మార్చుకుంది. మొదట ఈనెల 6 న సీబీఐ తన ఇంటికి రావాలని అక్కడే వివరణ ఇస్తానని స్పష్టం చేసింది కవిత. 

    అయితే ఆ తర్వాత FIR లో నాపేరు లేదు కాబట్టి , అలాగే ముందుగానే నాకు కొన్ని కార్యక్రమాలు ఫిక్స్ అయి ఉన్నందున రేపు సీబీఐ కి అందుబాటులో ఉండనని, అందుకు బదులుగా ఈనెల 11, 12 , 14 , 15 తేదీలలో ఒకరోజు ఎంచుకుంటే ఆ రోజు నా ఇంటికి రండి……. ఇంట్లోనే మీకు కావాల్సిన వివరణ ఇస్తానని స్పష్టం చేసింది. నాకు న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉందని , విచారణకు తప్పకుండా సహకరిస్తానని లేఖలో పేర్కొంది కవిత. అయితే ఈ లేఖ వల్ల సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

    బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోయిన కోమలీ ప్రసాద్

    Komalee Prasad ultra glamour in black dress
    Komalee Prasad ultra glamour in black dress
    Komalee Prasad ultra glamour in black dress
    Komalee Prasad ultra glamour in black dress

    అందాల భామ కోమలీ ప్రసాద్ బ్లాక్ డ్రెస్ లో జిగేల్ మంది. తాజాగా ఈ భామ హిట్ 2 చిత్రంలో నటించింది. ఆ చిత్ర ప్రమోషన్ లో భాగంగా బ్లాక్ డ్రెస్ లో వచ్చింది. ఎద అందాలు కనిపించి కనిపించకుండా ……. పిక్కల బలం చూపించి చూపించకుండా వేసిన డ్రెస్ ఈ భామను మరింత సెక్సీగా చూపించింది. అసలే అందగత్తె ఆపై ఎర్రతోలు భామ నల్ల డ్రెస్ లో మరింతగా కవ్వించేలా కనిపించింది.

    కోమలీ ప్రసాద్ అందాలకు అందరూ ముగ్దులయ్యారు. దాంతో రకరకాల భంగిమల్లో ఈ భామను ఫోటోలు తీశారు. ఈ భామ కూడా పలు భంగిమలకు ఫోజిచ్చింది. ఇంకేముంది ఆ ఫోటోలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగుతెరపై హీరోయిన్ గా సత్తా చాటాలని భావిస్తున్న కోమలీ ప్రసాద్ కు పలు చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే కాకుండా గ్లామర్ ను కూడా ఒలక బోస్తానని అంటోంది కోమలీ ప్రసాద్.

    టైగర్ నాగేశ్వర్ రావు సెట్స్ లో రేణు దేశాయ్ జన్మదిన వేడుకలు

    Renu desai birthday celebrations in tiger nageshwar rao sets
    Renu desai birthday celebrations in tiger nageshwar rao sets
    Renu desai birthday celebrations in tiger nageshwar rao sets
    Renu desai birthday celebrations in tiger nageshwar rao sets

    పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ జన్మదిన వేడుకలు టైగర్ నాగేశ్వర్ రావు సెట్స్ లో జరిగాయి. డిసెంబర్ 4 రేణు దేశాయ్ పుట్టినరోజు కావడంతో దర్శక నిర్మాతలు సెట్ లో ఆమె చేత బర్త్ డే కేక్ కట్ చేయించారు. చిత్ర యూనిట్ అందరూ రేణు దేశాయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యింది.

    ఎందుకంటే పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలను చూసుకుంటూ పవన్ కళ్యాణ్ వ్యవహారాలు చూసుకుంటూ ఉండిపోయింది. నటనకు దూరమైంది. అయితే పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత డిప్రెషన్ లో ఉంది. డిప్రెషన్ నుండి కోలుకున్న తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించాలా ? వద్దా ? అనే మీమాంసలో ఉండిపోయింది.

    కట్ చేస్తే ఓ సినిమాకు దర్శకత్వం వహించి నిర్మాతగా కూడా మారింది. ఇక ఇప్పుడేమో రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు చిత్రంతో నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తన పాత్రకు ప్రాధాన్యమున్న మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని అంటోంది రేణు దేశాయ్.

    హిట్ 2 చిత్రాన్ని చూసిన బాలయ్య

    balayya watched hit 2
    balayya watched hit 2
    balayya watched hit 2
    balayya watched hit 2

    నటసింహం నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలతో కలిసి పోతున్నాడు. ఇక సదరు యంగ్ హీరోలు కూడా ఇన్నాళ్లు బాలయ్య అంటే భయపడేవాళ్లు కానీ బాలయ్య అంతరంగం ఏంటో తెలిసిన కుర్ర హీరోలు ” జై బాలయ్య ” అంటూ బాలయ్య కు దగ్గర అవుతున్నారు. ఇందుకు బాలయ్య షో ” అన్ స్టాపబుల్ ” కూడా ఎంతగానో దోహదపడింది అనే చెప్పాలి.

    ఇక తాజాగా అడవి శేష్ హీరోగా నటించిన ” హిట్ – 2 ” చిత్రం విడుదల కాగా ఆ సినిమాకు సాలిడ్ గా హిట్ టాక్ వచ్చింది. ఆ సినిమాను నిర్మించింది హీరో నాని కావడం విశేషం. దాంతో నాని , అడవి శేష్ ఇద్దరు కూడా బాలయ్య కు స్పెషల్ షో వేశారు. ఆ సినిమా చూసిన బాలయ్య నాని ని అలాగే అడవి శేష్ ని కూడా అభినందించాడు. దాంతో నాని , అడవి శేష్ ఇద్దరు కూడా సంతోషించారు అంతేకాదు …… బాలయ్య తో సెల్ఫీలు తీసుకున్నారు. ఆ సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గ హిట్ – 2 చిత్రాన్ని చేసారు. హిట్ 1 లో విశ్వక్ సేన్ నటించగా హిట్ 2 లో మాత్రం అడవి శేష్ హీరోగా నటించాడు. డిసెంబర్ 2 న విడుదలైన ఈ చిత్రానికి యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో హిట్ 3 చిత్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

    Gujarat assembly elections 2022 : గుజరాత్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభం

    Gujarat assembly elections 2022: The second phase of polling has started in Gujarat
    Gujarat assembly elections 2022: The second phase of polling has started in Gujarat

    ఈరోజు గుజరాత్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దాంతో నిన్న సాయంత్రమే ఢిల్లీ నుండి గుజరాత్ వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. తల్లి ఆశీర్వాదం తీసుకొని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు మోడీ. గుజరాత్ లో మొత్తంగా రెండు దశల్లోనే పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈరోజుతో గుజరాత్ లో పోలింగ్ పూర్తి కానుంది. దాంతో డిసెంబర్ 8 న ఓట్ల లెక్కింపు జరుగనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు గుజరాత్ కింగ్ ఎవరో తెలియనుంది. అన్ని సర్వేల ప్రకారం అయితే గుజరాత్ లో మళ్లీ కమల వికాసం ఖాయమనే అంటున్నాయి. అయితే కాంగ్రెస్ కంటే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గుజరాత్ మోడీ, అమిత్ షా ల సొంత రాష్ట్రం కావడంతో గట్టిగానే ప్రచారం చేశారు.

    పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న తెలుగు పీపుల్ ఫౌండేషన్

    Telugu People Foundation Telugu People Foundation stands for poor students
    Telugu People Foundation Telugu People Foundation stands for poor students
    Telugu People Foundation Telugu People Foundation stands for poor students
    Telugu People Foundation Telugu People Foundation stands for poor students

    న్యూజెర్సీలో ఉన్న ప్రవాసాంధ్రులు ” Telugu People Foundation ” అనే స్వచ్ఛంద సంస్థ ను నెలకొల్పి తమకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన రెండు తెలుగు రాష్ట్రాలకు అండగా ఉండాలని భావించారు. ఆర్ధిక స్థోమత లేక ఉన్నత చదువులు చదవలేని పేద విద్యార్థులకు అండగా నిలబడాలని భావించి వాళ్లకు స్కాలర్ షిప్ లు అందిస్తూ సామాజిక సేవలో తరిస్తున్నారు. గత 14 సంవత్సరాలుగా….. ఇప్పటి వరకు 30 మిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఈ సేవా కార్యక్రమాలకు వినియోగించారు. 325 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించారు.

    తెలుగు పీపుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 14 సంవత్సరాలు అవుతుండటంతో న్యూజెర్సీలో ని ఎడిసన్ లోగల జేపీ స్టీవెన్స్ హైస్కూలు లో 14 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 107,000 డాలర్ల ను ఫండ్ గా సేకరించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ , కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్ , చార్టెడ్ అకౌంటెంట్ వంటి ఉన్నత విద్య కోసం ఆర్ధిక సహాయం చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ సంస్థ చేసిన 325 మందిలో 126 మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్టూడెంట్స్ ఉన్నారు.

    26 మంది ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ ఐ టి వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో చదువుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు తెలుగు పీపుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కొత్త కృష్ణ. ఫౌండర్ కొనిశెట్టి ప్రసాద్ . ఈ కార్యక్రమంలో అనూప్ రూబెన్స్ , గాయకుడు సింహా లతో పాటుగా పలువురు పాల్గొన్నారు. తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్ మిమిక్రీ తో అలరించాడు. న్యూజెర్సీ, ఎడిసన్ లకు చెందిన తెలుగు కుటుంబాలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.

    50 రోజులు పూర్తి చేసుకున్న కాంతార

    kantara completes 50 days
    kantara completes 50 days

    kantara completes 50 days

    kantara completes 50 daysచిన్న చిత్రంగా వచ్చిన కనడ చిత్రం” కాంతార ” ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కాంతార అక్టోబర్ 15 న తెలుగులో విడుదల అయ్యింది. మొదట కన్నడంలో మాత్రమే ఈ చిత్రాన్ని విడుదల చేయగా అక్కడ అద్భుతమైన స్పందన వచ్చింది. దాంతో తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల చేసారు.

    తెలుగులో విడుదలై నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. తెలుగులో కూడా పెద్దగా ఆడదులే అనికొనే కొన్ని థియేటర్ లలోనే విడుదల చేసారు. అయితే అనూహ్యంగా కాంతార చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో థియేటర్లను పెంచారు. కట్ చేస్తే ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

    ఇక తెలుగులో ఏకంగా 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు రజనీకాంత్ లాంటి స్టార్ హీరోల సినిమాలు మాత్రమే భారీ వసూళ్లు సాధించేవి. కానీ కాంతార మిగతా హీరోల రికార్డులను బద్దలుకొట్టి చరిత్ర సృష్టించింది తెలుగులో. ఒక డబ్బింగ్ చిత్రం అందునా స్టార్ లేని చిత్రం ఇంతటి సంచలనం సృష్టించడం పట్ల సినీ విశ్లేషకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కాంతార చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు రిషబ్ శెట్టి.

    బ్రేకింగ్ : విజయ్ సేతుపతి షూటింగ్ లో ప్రమాదం

    breaking news : accident in vijay sethupathi 's shooting - fight master dead
    breaking news : accident in vijay sethupathi 's shooting - fight master dead
    breaking news : accident in vijay sethupathi 's shooting - fight master dead
    breaking news : accident in vijay sethupathi ‘s shooting – fight master dead

    తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ” విడుదలై ” చిత్ర షూటింగ్ లో ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు దాంతో షూటింగ్ నిలిచిపాయింది. వివరాలలోకి వెళితే …….. చెన్నై పరిసర ప్రాంతాల్లో ” విడుదలై ” అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో హీరోగా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.

    చెన్నై పరిసర ప్రాంతంలో ట్రైన్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ సురేష్ నేతృత్వంలో ఈ భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ట్రైన్ పట్టాలు తప్పి భారీ ప్రమాదం చోటు చేసుకునే సన్నివేశం కావడంతో పలు జాగ్రత్తలు తీసుకున్నారు కానీ అనూహ్యంగా ఆ ట్రైన్ కింద పడిపోయాడు ఫైట్ మాస్టర్ సురేష్. దాంతో అక్కడికక్కడే చనిపోయాడు. మరికొందరికి గాయాలయ్యాయి. దాంతో తీవ్ర విషాదం నెలకొంది. వెంటనే షూటింగ్ ఆపేసి హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టారు.

    100 కోట్ల ఆస్థి పోగొట్టుకున్నానంటూ బోరుమన్న చంద్రమోహన్

    senior actor chandra mohan about his properties
    senior actor chandra mohan about his properties
    senior actor chandra mohan about his properties
    senior actor chandra mohan about his properties

    శోభన్ బాబు ఎంత చెబుతున్నా వినకుండా హైదరాబాద్ , చెన్నై లలో ఉన్న ఎకరాల కొద్దీ భూములను అమ్మానని , దాంతో 100 కోట్ల ఆస్థి పోగొట్టుకున్నానంటూ బోరుమన్నాడు సీనియర్ నటులు చంద్రమోహన్. ఇటీవల JSW & Jaiswaraajya.tv లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలను చేసాడు చంద్రమోహన్.

    హైదరాబాద్ లోని కొంపల్లిలో ద్రాక్ష తోట కొన్నాను. శోభన్ బాబు సలహాతోనే హైదరాబాద్ లో అలాగే చెన్నై లో పలు చోట్ల భూములను కొన్నానని, అయితే వాటిని చూసుకోవడం ఇబ్బంది అనిపించి అమ్మేయాలని అనుకున్నప్పుడు ఈ విషయం శోభన్ బాబుకు తెలిసి వద్దంటే వద్దని వారించాడని , కానీ నేను మాత్రం అతడి మాటలు వినిపించుకోకుండా ఆ భూములను తక్కువ ధరకే అమ్మానని అవి 100 కోట్లకు పైగా విలువైన భూములను ఆవేదన వ్యక్తం చేసాడు.

    నేను ఇన్నేళ్ల నటజీవితంలో సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అని బాధపడ్డాడు చంద్రమోహన్. తెలుగునాట 1100 చిత్రాలకు పైగా నటించి సంచలనం సృష్టించాడు. హీరోగా , విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా అన్ని రకాల పాత్రలను పోషించిన గొప్ప నటుడు చంద్రమోహన్. అయితే గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నాడు.