kantara completes 50 daysచిన్న చిత్రంగా వచ్చిన కనడ చిత్రం” కాంతార ” ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కాంతార అక్టోబర్ 15 న తెలుగులో విడుదల అయ్యింది. మొదట కన్నడంలో మాత్రమే ఈ చిత్రాన్ని విడుదల చేయగా అక్కడ అద్భుతమైన స్పందన వచ్చింది. దాంతో తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల చేసారు.
తెలుగులో విడుదలై నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. తెలుగులో కూడా పెద్దగా ఆడదులే అనికొనే కొన్ని థియేటర్ లలోనే విడుదల చేసారు. అయితే అనూహ్యంగా కాంతార చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో థియేటర్లను పెంచారు. కట్ చేస్తే ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇక తెలుగులో ఏకంగా 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు రజనీకాంత్ లాంటి స్టార్ హీరోల సినిమాలు మాత్రమే భారీ వసూళ్లు సాధించేవి. కానీ కాంతార మిగతా హీరోల రికార్డులను బద్దలుకొట్టి చరిత్ర సృష్టించింది తెలుగులో. ఒక డబ్బింగ్ చిత్రం అందునా స్టార్ లేని చిత్రం ఇంతటి సంచలనం సృష్టించడం పట్ల సినీ విశ్లేషకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కాంతార చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు రిషబ్ శెట్టి.