
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ జన్మదిన వేడుకలు టైగర్ నాగేశ్వర్ రావు సెట్స్ లో జరిగాయి. డిసెంబర్ 4 రేణు దేశాయ్ పుట్టినరోజు కావడంతో దర్శక నిర్మాతలు సెట్ లో ఆమె చేత బర్త్ డే కేక్ కట్ చేయించారు. చిత్ర యూనిట్ అందరూ రేణు దేశాయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యింది.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలను చూసుకుంటూ పవన్ కళ్యాణ్ వ్యవహారాలు చూసుకుంటూ ఉండిపోయింది. నటనకు దూరమైంది. అయితే పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత డిప్రెషన్ లో ఉంది. డిప్రెషన్ నుండి కోలుకున్న తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించాలా ? వద్దా ? అనే మీమాంసలో ఉండిపోయింది.
కట్ చేస్తే ఓ సినిమాకు దర్శకత్వం వహించి నిర్మాతగా కూడా మారింది. ఇక ఇప్పుడేమో రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు చిత్రంతో నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తన పాత్రకు ప్రాధాన్యమున్న మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని అంటోంది రేణు దేశాయ్.