ఈరోజు గుజరాత్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దాంతో నిన్న సాయంత్రమే ఢిల్లీ నుండి గుజరాత్ వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. తల్లి ఆశీర్వాదం తీసుకొని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు మోడీ. గుజరాత్ లో మొత్తంగా రెండు దశల్లోనే పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈరోజుతో గుజరాత్ లో పోలింగ్ పూర్తి కానుంది. దాంతో డిసెంబర్ 8 న ఓట్ల లెక్కింపు జరుగనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు గుజరాత్ కింగ్ ఎవరో తెలియనుంది. అన్ని సర్వేల ప్రకారం అయితే గుజరాత్ లో మళ్లీ కమల వికాసం ఖాయమనే అంటున్నాయి. అయితే కాంగ్రెస్ కంటే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గుజరాత్ మోడీ, అమిత్ షా ల సొంత రాష్ట్రం కావడంతో గట్టిగానే ప్రచారం చేశారు.
Breaking News