31.1 C
India
Wednesday, June 26, 2024
More
    Home Blog Page 1588

    NAYANTARA:నయనతార ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

    nayantara-do-you-know-the-value-of-nayantaras-assets
    nayantara-do-you-know-the-value-of-nayantaras-assets
    nayantara-do-you-know-the-value-of-nayantaras-assets
    nayantara-do-you-know-the-value-of-nayantaras-assets

    దక్షిణ భారతంలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు నయనతార. మలయాళ ముద్దుగుమ్మ అయిన నయనతార తమిళనాట స్థిరపడింది. ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ తమిళంతో పాటుగా తెలుగు , మలయాళ చిత్రాల్లో కూడా నటించింది. ఇక తాజాగా హిందీలో కూడా అడుగుపెట్టింది.

    ఇక ఈ భామ ఇప్పటి వరకు 75 సినిమాల్లో నటించిన ఈ భామ భారీగా ఆస్తులు కూడబెట్టింది. హైదరాబాద్ లో రెండు అధునాతనమైన బంగ్లాలు సొంతం చేసుకుంది. అంతేకాదు తమిళనాట నాలుగు ఖరీదైన బంగ్లాలు కొన్నది. అలాగే విలాసవంతమైన ఆఫీస్ కూడా ఉంది. ఇక కేరళలో కూడా అధునాతనమైన రెండు ఇండ్లు ఉన్నాయట. ఫామ్ హౌజ్ కూడా. వీటి మొత్తం విలువ 165 కోట్లు అని తెలుస్తోంది.

    నయనతార ఆస్తుల విలువ 165 కోట్లు అంటే ఈ విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమా ! మార్కెట్ రేటు కాదు. మార్కెట్ రేటు ప్రకారం సుమారుగా 1000 కోట్ల పై మాటే అని తెలుస్తోంది. ప్రభుత్వానికి చూపించే లెక్కలు వేరు …….. మార్కెట్ విలువ వేరుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఒక్కో సినిమాకు 10 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకుంటోంది నయనతార. 

    ఆగస్టు బాగుంది సెప్టెంబర్ దొబ్బింది

    august-is-good-and-september-is-bad
    august-is-good-and-september-is-bad
    august-is-good-and-september-is-bad
    august-is-good-and-september-is-bad

    ఆగస్టు నెలలో విడుదలైన చిత్రాల్లో ఏకంగా 3 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి దాంతో యావత్ టాలీవుడ్ ఫుల్ జోష్ లో ఉంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార , దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం , నిఖిల్ హీరోగా నటించిన  కార్తికేయ 2 ఈ మూడు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. విశేషం ఏంటంటే ……. బింబిసార , సీతారామం , కార్తికేయ 2 ఈ మూడు చిత్రాలను నిర్మించిన నిర్మాతలకు అలాగే కొన్న బయ్యర్లకు కూడా భారీగా లాభాలు వచ్చాయి.

    దాంతో టాలీవుడ్ చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు బాగానే ఉండటంతో సెప్టెంబర్ లో తప్పకుండా ఓ హిట్ లభిస్తుందేమో అనుకున్నారు. కానీ ఈ నెలలో అప్పుడే సగానికి పైగా రోజులు అయిపోయాయి. కానీ విడుదలైన సినిమాలు ఏవి కూడా కనీస ఓపెనింగ్స్ కూడా తీసుకు రాలేకపోయాయి. ఇక మరో రెండు వారాల్లో కృష్ణ బృందా విహారి , గుర్తుందా శీతాకాలం , అల్లూరి , పొన్నియన్ సెల్వన్ -1 చిత్రాలు విడుదల అవుతున్నాయి.

    సెప్టెంబర్ నెల సగంలో విడుదలైన చిత్రాలు ప్లాప్ అయ్యాయి. ఇక మిగిలిన సగం నెలలో రిలీజ్ అవుతున్న చిత్రాల్లో అంచనాలున్న చిత్రం పొన్నియన్ సెల్వన్ -1 మాత్రమే ! మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. అలాగే కృష్ణ బృందా విహారి చిత్రం పై కూడా కాస్త అంచనాలున్నాయి. మరి వీటిలో ఏవి సత్తా చాటుతాయో చూడాలి. ఆగస్టు అదిరింది …… సెప్టెంబర్ ఇప్పటి వరకు దొబ్బింది.

    DULQER SALMAN- SITA RAMAM: సీతారామం సీక్వెల్ గురించి దుల్కర్ ఏమన్నాడంటే

    dulquer-salmaan-sita-rama-what-dulquer-had-to-say-about-sita-rama-sequel
    dulquer-salmaan-sita-rama-what-dulquer-had-to-say-about-sita-rama-sequel
    dulquer-salmaan-sita-rama-what-dulquer-had-to-say-about-sita-rama-sequel
    dulquer-salmaan-sita-rama-what-dulquer-had-to-say-about-sita-rama-sequel

    దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” సీతారామం ”. ఆగస్టు 5 న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు దర్శకుడు హను రాఘవపూడి పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు కానీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని మాత్రం అందుకోలేకపోయాడు. ఆ లోటు సీతారామం చిత్రంతో తీరింది.

    హను రాఘవపూడి ప్లాప్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి. కట్ చేస్తే రోజు రోజుకు ప్రజాధారణ పెరిగి పెద్ద విజయాన్ని అందుకుంది. తెలుగు , తమిళ , మలయాళ భాషల్లో మంచి హిట్ కావడంతో హిందీలో కూడా విడుదల చేసారు. ఇక హిందీలో కూడా మంచి విజయాన్నే సాధించింది.

    దాంతో సీతారామం చిత్రానికి సీక్వెల్ ఉంటుందా ? అని హీరో దుల్కర్ సల్మాన్ ని ప్రశ్నించడంతో లేదు మొహమాటం లేకుండా చెప్పాడు. సీతారామం ఓ క్లాసిక్ . క్లాసిక్ చిత్రాలను పదేపదే టచ్ చేయొద్దు. అందుకే దానికి సీక్వెల్ ఉండకపోవచ్చు. అలాగే రీమేక్ కూడా సాధ్యం కాదు. సీతారామం లాంటి క్లాసికల్ చిత్రాలను మళ్ళీ మళ్ళీ టచ్ చేయలేము అంటూ చెప్పుకొచ్చాడు. సీతారామం చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ – స్వప్న సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.

    KRITHI SHETTY: హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్న భామ

    krithi-shetty-bhama-who-received-a-hat-trick-of-flops
    krithi-shetty-bhama-who-received-a-hat-trick-of-flops
    krithi-shetty-bhama-who-received-a-hat-trick-of-flops
    krithi-shetty-bhama-who-received-a-hat-trick-of-flops

    ముంబైలో స్థిరపడిన బెంగుళూర్ భామ కృతి శెట్టి వరుస పరాజయాలతో సతమతం అవుతోంది. ఉప్పెన చిత్రంతో హీరోయిన్ గా  తెలుగు తెరకు పరిచయమైంది మంగుళూరు భామ కృతి శెట్టి. మొదటి చిత్రమే సూపర్ హిట్ కావడంతో ఈ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. దాంతో వెంటవెంటనే బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో నటించింది. ఆ రెండు కూడా మంచి హిట్ అయ్యాయి.

    కట్ చేస్తే ఆ మూడు చిత్రాల తర్వాత చేసిన మూడు చిత్రాలు ఈ ఏడాదిలో విడుదల అయ్యాయి. ఇక మూడు చిత్రాలు కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి. దాంతో ఈ భామ కెరీర్ డైలమాలో పడింది. ఉప్పెన , బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ చిత్రాల తర్వాత ది వారియర్ , మాచర్ల నియోజకవర్గం , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలను చేసింది.

    అయితే ఈ మూడు చిత్రాలు కూడా ప్లాప్ అయ్యాయి. రామ్ సరసన నటించిన ది వారియర్ తెలుగు , తమిళ భాషల్లో రూపొందింది. కానీ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం చిత్రం చేయగా అది కూడా డిజాస్టర్ అయ్యింది. తాజాగా సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమా సెప్టెంబర్ 16 న విడుదలైంది. ఈ సినిమా కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది. దాంతో కృతి శెట్టి కెరీర్ అగమ్యగోచరంగా తయారయ్యింది. 

    DODDI KOMARAYYA: తెరపైకి దొడ్డి కొమురయ్య బయోపిక్

    doddi-komarayya-biopic-of-doddi-komarayya-on-screen
    doddi-komarayya-biopic-of-doddi-komarayya-on-screen
    doddi-komarayya-biopic-of-doddi-komarayya-on-screen
    doddi-komarayya-biopic-of-doddi-komarayya-on-screen

    నైజాం నవాబులను అలాగే రజాకార్లను ఎదురించి పోరాడి…… ఆ పోరాటంలో అమరుడైన మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమురయ్య. ఈరోజు సెప్టెంబర్ 17 కావడంతో తెలంగాణ కోసం అసువులు బాసిన అమర వీరులను తల్చుకుంటున్నారు. వాళ్లలో మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమురయ్య. వరంగల్ జిల్లా కడవెండి గ్రామంలో జన్మించాడు.

    సాధారణ కుటుంబంలో జన్మించిన దొడ్డి కొమురయ్య గొర్రెల కాపరి. అయితే కడవెండి లో దొర దురాగతాలను , అలాగే దొర తల్లి జానకమ్మ అరాచకాలను సహించలేక ఎదురు తిరిగి రజాకార్ల తూటాలకు బలైన మొట్టమొదటి అమరుడు. దొడ్డి కొమురయ్య మరణం తర్వాతనే తెలంగాణ సాయుధ పోరాటం తీవ్రమయ్యింది.

    ఆ తర్వాత కొన్నాళ్ళకు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చొరవతో సైనిక చర్య ఫలితంగా తెలంగాణ నైజాం నవాబు కబంధ హస్తాలనుండి బయటపడింది. దాంతో ఆ మహనీయుడి బయోపిక్ చేయాలనే తలంపుతో ఉన్నాడు గోరంట్ల సత్యం. ఈ కథను వెబ్ సిరీస్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు గోరంట్ల సత్యం.

    AMIT SHAH- ETELA RAJENDER: ఈటల రాజేందర్ తో సమావేశమైన అమిత్ షా

    amit-shah-etela-rajender-amit-shah-met-with-etela-rajender
    amit-shah-etela-rajender-amit-shah-met-with-etela-rajender
    amit-shah-etela-rajender-amit-shah-met-with-etela-rajender
    amit-shah-etela-rajender-amit-shah-met-with-etela-rajender

    కేంద్ర హోం  శాఖా మంత్రి అమిత్ షా మాజీ మంత్రి , హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో సమావేశమయ్యారు. శామీర్ పేటలోని ఈటల ఇంటికి వెళ్లారు అమిత్ షా. ఇటీవల ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దాంతో ఈటల రాజేందర్ ను పరామర్శించడానికి శామీర్ పేటకు వెళ్లారు. అక్కడ దాదాపు అరగంట పాటు చర్చలు జరిగాయి. అందులో 15 నిమిషాల పాటు ఈటల రాజేందర్ తో ఏకాంతంగా సమావేశమయ్యారు అమిత్ షా. ఇద్దరి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. 

    VANI BHOJAN- JAI: ఆ హీరోతో సహజీవనం చేస్తున్న వాణి భోజన్

    vani-bhojan-jai-vani-bhojan-is-living-with-the-hero
    vani-bhojan-jai-vani-bhojan-is-living-with-the-hero
    vani-bhojan-jai-vani-bhojan-is-living-with-the-hero
    vani-bhojan-jai-vani-bhojan-is-living-with-the-hero

    హీరోయిన్ వాణి భోజన్ హీరో జై తో సహజీవనం చేస్తోంది. ఈ వార్తలు తమిళ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈరోజుల్లో సహజీవనం చేయడం పెద్ద మ్యాటర్ కాదు. అయితే సహజీవనం చేసే సమయంలో ఒకరి మీద ఒకరు ప్రేమ బాగా ఒలకబోసుకుంటారు. నువ్వు లేనిదే జీవితమే లేదు , ఈ ప్రపంచమే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తారు. కట్ చేస్తే తేడా వచ్చిందనుకో ఆగ్రహంతో ఊగిపోతారు …… ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు.

    అలాగే తమిళ హీరో జై – అంజలి పీకల్లోతు ప్రేమలో పడ్డారు. ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకున్నారు. కట్ చేస్తే ఇద్దరి మధ్య తేడా కొట్టింది విడిపోయారు. అంజలి – జై విడిపోయాక వాణి భోజన్ తో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది ఆ భామ కూడా జై ని ప్రేమించింది. దాంతో గతకొంత కాలంగా జై – వాణి భోజన్ సహజీవనం చేస్తున్నారు.

    సహజీవనం వరకు బాగానే ఉన్నప్పటికీ వాణి భోజన్ ని ఎవరైనా దర్శక నిర్మాతలు కలవాలంటే జై అడ్డుగా ఉన్నాడట. దాంతో వాణి భోజన్ కోసం ఎదురు చూసిన వాళ్ళు జై ని భరించలేక ఆమె స్థానంలో మిగతా హీరోయిన్ లను ఎంచుకుంటున్నారట. ఇంకేముంది వాణి భోజన్ కెరీర్ అగమ్యగోచరంలో పడినట్లే అని అంటున్నారు. 

    MAHESH BABU- ALIA BHATT- DEEPIKA PADUKONE: మహేష్ బాబు తో రొమాన్స్ చేసే భామ ఎవరు ?

    mahesh-babu-alia-bhatt-deepika-padukone-who-is-mahesh-babus-romantic-partner
    mahesh-babu-alia-bhatt-deepika-padukone-who-is-mahesh-babus-romantic-partner
    mahesh-babu-alia-bhatt-deepika-padukone-who-is-mahesh-babus-romantic-partner
    mahesh-babu-alia-bhatt-deepika-padukone-who-is-mahesh-babus-romantic-partner

    సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రపంచాన్ని చుట్టేసే సాహసయాత్రికుడిగా మహేష్ బాబు నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక హీరో అయితే సెట్ అయ్యాడు మరి హీరోయిన్ ఎవరు ? మహేష్ తో రొమాన్స్ చేసేది ఎవరు ? అనే ప్రశ్న ఉదయించింది.

    దర్శకులు రాజమౌళి పరిశీలనలో ఇద్దరు స్టార్ హీరోయిన్ లు ఉన్నారట. ఒకరేమో ఆలియా భట్ కాగా మరొకరు దీపికా పదుకొన్ అని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆలియా భట్ గర్భవతి. కానీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే నాటికి అలియా మాములు మనిషి అవ్వడం ఖాయం. కాబట్టి డేట్స్ సమస్య ఎదురు కాదు. అయితే ఆలియా ను సెలెక్ట్ చేస్తాడా ? లేదా ? అన్నది చూడాలి.

    ఇక దీపికా పదుకోన్ విషయానికి వస్తే …….. మహేష్ సరసన దీపికా పదుకోన్ ని ఎంపిక చేయడం ఖాయమని వినిపిస్తోంది. దీపికా పదుకోన్ బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. ఆలియా భట్ ఆల్రెడీ ఆర్ ఆర్ ఆర్ లో నటించింది. దాంతో ఈ సినిమాలో దీపికా పదుకోన్ ని ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మహేష్ తో రొమాన్స్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. త్వరలోనే హీరోయిన్ ను ఫైనల్ చేయనున్నారు. 

    UBLOOD AND STAR V ఆధ్వర్యంలో మోడీ జన్మదిన వేడుకలు

    /modis-birthday-celebrations-under-the-auspices-of-ublood-and-star-v-educational-society
    /modis-birthday-celebrations-under-the-auspices-of-ublood-and-star-v-educational-society
    /modis-birthday-celebrations-under-the-auspices-of-ublood-and-star-v-educational-society
    /modis-birthday-celebrations-under-the-auspices-of-ublood-and-star-v-educational-society

    సెప్టెంబర్ 17 భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్టార్ V ఎడ్యుకేషనల్ సొసైటీ – యు బ్లడ్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. రక్తదాన ఆవశ్యకతను అలాగే యు బ్లడ్ యాప్ ని జగదీష్ యలమంచిలి రూపొందించడానికి గల కారణాలను విశ్లేషించారు మాజీ జెడ్పీ చైర్మన్ , బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతురి నాగభూషణం.

    రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్నవాళ్లు ప్రాణాపాయం నుండి కోలుకునే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువతతో పాటుగా కళాశాల కార్యదర్శి వెంకటేష్ , ప్రసాద్, రామాంజనేయులు, రెడ్ క్రాస్ సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

    SHRADDHA KAPOOR: థైస్ షోతో పిచ్చెక్కించిన శ్రద్దా కపూర్

    shraddha-kapoor-shraddha-kapoor-went-crazy-with-thais-show
    shraddha-kapoor-shraddha-kapoor-went-crazy-with-thais-show
    shraddha-kapoor-shraddha-kapoor-went-crazy-with-thais-show
    shraddha-kapoor-shraddha-kapoor-went-crazy-with-thais-show

    బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ థైస్ షోతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది. ఈ భామ పెట్టిన ఫోజులు చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. బలమైన థైస్ కుర్రాళ్ళ గుండెల్లో బాంబులు పేలేలా చేస్తోంది. తాజాగా ఈ భామ రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    బ్లాక్ అండ్ వైట్ లో దర్శనం ఇచ్చిన ఈ భామ థైస్ ని పిచ్చెక్కించేలా చూపించేసింది. శ్రద్దా కపూర్ థైస్ చూసి ఊహాలోకాల్లో తేలిపోతున్నారు. ఆ అందాలు చూసి నోటి మాట రావడం లేదంటే ఈ భామ ఎంతగా కైపెక్కిస్తొందో అర్ధం చేసుకోవచ్చు. బాలీవుడ్ లో ఒకప్పుడు విలన్ గా చెరగని ముద్ర వేసిన శక్తి కపూర్ కూతురే ఈ శ్రద్దా కపూర్.

    పేరు శ్రద్దా కపూర్ కానీ పేరుకి అందాల ఆరబోతకు సంబంధం లేకుండా షాకిస్తోంది. శ్రద్దా కపూర్ బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా డార్లింగ్ ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటించింది. అయితే ఆ సినిమా తెలుగులో ప్లాప్ అయ్యింది దాంతో ఈ భామకు మళ్ళీ తెలుగులో అవకాశాలు లేకుండాపోయాయి.