ముంబైలో స్థిరపడిన బెంగుళూర్ భామ కృతి శెట్టి వరుస పరాజయాలతో సతమతం అవుతోంది. ఉప్పెన చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది మంగుళూరు భామ కృతి శెట్టి. మొదటి చిత్రమే సూపర్ హిట్ కావడంతో ఈ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. దాంతో వెంటవెంటనే బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో నటించింది. ఆ రెండు కూడా మంచి హిట్ అయ్యాయి.
కట్ చేస్తే ఆ మూడు చిత్రాల తర్వాత చేసిన మూడు చిత్రాలు ఈ ఏడాదిలో విడుదల అయ్యాయి. ఇక మూడు చిత్రాలు కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి. దాంతో ఈ భామ కెరీర్ డైలమాలో పడింది. ఉప్పెన , బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ చిత్రాల తర్వాత ది వారియర్ , మాచర్ల నియోజకవర్గం , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలను చేసింది.
అయితే ఈ మూడు చిత్రాలు కూడా ప్లాప్ అయ్యాయి. రామ్ సరసన నటించిన ది వారియర్ తెలుగు , తమిళ భాషల్లో రూపొందింది. కానీ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం చిత్రం చేయగా అది కూడా డిజాస్టర్ అయ్యింది. తాజాగా సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమా సెప్టెంబర్ 16 న విడుదలైంది. ఈ సినిమా కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది. దాంతో కృతి శెట్టి కెరీర్ అగమ్యగోచరంగా తయారయ్యింది.