హీరోయిన్ వాణి భోజన్ హీరో జై తో సహజీవనం చేస్తోంది. ఈ వార్తలు తమిళ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈరోజుల్లో సహజీవనం చేయడం పెద్ద మ్యాటర్ కాదు. అయితే సహజీవనం చేసే సమయంలో ఒకరి మీద ఒకరు ప్రేమ బాగా ఒలకబోసుకుంటారు. నువ్వు లేనిదే జీవితమే లేదు , ఈ ప్రపంచమే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తారు. కట్ చేస్తే తేడా వచ్చిందనుకో ఆగ్రహంతో ఊగిపోతారు …… ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు.
అలాగే తమిళ హీరో జై – అంజలి పీకల్లోతు ప్రేమలో పడ్డారు. ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకున్నారు. కట్ చేస్తే ఇద్దరి మధ్య తేడా కొట్టింది విడిపోయారు. అంజలి – జై విడిపోయాక వాణి భోజన్ తో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది ఆ భామ కూడా జై ని ప్రేమించింది. దాంతో గతకొంత కాలంగా జై – వాణి భోజన్ సహజీవనం చేస్తున్నారు.
సహజీవనం వరకు బాగానే ఉన్నప్పటికీ వాణి భోజన్ ని ఎవరైనా దర్శక నిర్మాతలు కలవాలంటే జై అడ్డుగా ఉన్నాడట. దాంతో వాణి భోజన్ కోసం ఎదురు చూసిన వాళ్ళు జై ని భరించలేక ఆమె స్థానంలో మిగతా హీరోయిన్ లను ఎంచుకుంటున్నారట. ఇంకేముంది వాణి భోజన్ కెరీర్ అగమ్యగోచరంలో పడినట్లే అని అంటున్నారు.