భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ఎన్నికల్లో ఓటమి ఖాయమా ? అంటే అవుననే అంటున్నాయి బ్రిటన్ సర్వేలు. బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో ఆ పదవికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే . బ్రిటన్ పదవికి పలువురు పోటీ పడగా పోటీలో మిగిలింది మాత్రం భారత సంతతికి చెందిన రిషి సునాక్ తో పాటుగా లిజ్ ట్రస్ ఉన్నారు.
అయితే లిజ్ ట్రస్ కు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ బహిరంగ మద్దతు ప్రకటించాడు. అంతేకాదు లిజ్ ట్రస్ కు మద్దతుగా నిలవాలని కన్జర్వేటివ్ పార్టీ ప్రతినిధులను కోరుతున్నాడు కూడా. 1,75, 000 మంది కన్జర్వేటివ్ సభ్యులు ఉండగా అందులో ఎవరు ఎక్కువగా మద్దతు తెలుపుతారో వాళ్లే బ్రిటన్ ప్రధాని కాగలరు.
ప్రస్తుతం లిజ్ ట్రస్ కు విజయావకాశాలు 61 శాతం ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇక రిషి సునాక్ కు కేవలం 39 శాతం మాత్రమే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మెజారిటీ కన్జర్వేటివ్ సభ్యులు ఎవరికి మద్దతు తెలుపుతారు అన్నది సెప్టెంబర్ 5 న తేలనుంది. ఇప్పటి వరకు అయితే లిజ్ ట్రస్ ముందంజలో ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే రిషి సునాక్ విజయం సాధించడం ఖాయం. ఆ అద్భుతం జరగాలని ఆశిస్తున్నారు భారతీయులు.