29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Ambati VS Chandra babu : చంద్రబాబు తనపై కుట్ర చేశాడంటున్న అంబటి.. ఎలా అంటే!

    Date:

    Ambati VS Chandra babu : వైసీపీలో అంబటి రాంబాబు మొదటి నుంచి కీలక నేతగా ఉన్నారు. అయన 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టిడిపీపై తన దైన శైలిలో విమర్శలు చేయడంలో అంబటి దిట్ట. చంద్రబాబు, లోకేష్ పై కూడా ఆయన వ్యంగ్యంగా కామెంట్లు చేస్తుంటారు. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మెప్పు పొందేందుకు ఆయన ప్రయత్నిస్తూ ఉంటారని వైసీపీ శ్రేణుల్లోనూ టాక్  వినిపిస్తుంది. ఇప్పుడు టీడీపీ మంత్రం అంబటిని అరగంట మంత్రి అంటూ  ఆడుకుంటున్నది..
    తాజాగా ఆయన చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. తనను ఓడించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ అభ్యర్థిగా తేవడం ఇందులో భాగమేనని చెప్పుకొచ్చారు. పార్టీ అభ్యర్థిని మార్చినంత మాత్రాన అది కుట్ర ఎలా అవుతుందని అది పార్టీ అంతర్గత విషయమని ఎవరైనా అడిగితే లేదు.. ఇది కుట్రే అంటూ చెబుతున్నారు  టీడీపీ కన్నాను తెరపైకి తేవడంతో అంబటికి సత్తెనపల్లిలో ఇబ్బంది కర పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పార్టీలోనే సగం మంది కేడర్ ఆయనకు దూరమయ్యారు. సత్తెనపల్లిలో అంబటి దందాలు కూడా  ప్రజల్లో ఆయనపై వ్యతిరేకతను తెచ్చాయి. ఇక వర్గ పోరాటాలు సరే సరి.
    అయితే సత్తెనపల్లిలో టీడీపీ కన్నా లక్ష్మీనారాయణ ను తెరపైకి తేవడంతో ఇక అంబటి రాంబాబు పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక తాను ఓడిపోయినట్లేనని అంబటి భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీ కూడా సత్తెనపల్లి నుంచి కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. సత్తెనపల్లిలో అంబటిపై వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో పార్టీ అధిష్టానం ఆ దిశగా దృష్టి సారించినట్లు సమాచారం. అయితే టీడీపీ అభ్యర్థిని మారిస్తేనే కుట్ర అంటున్నారంటే  ఆయన పరిస్థితి ఏంటో అర్థం అయ్యి ఉంటుందని పలువురు నవ్వుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ambati Tea Cups : చెత్తకుప్పల్లో అంబ‘టీ’ కప్పులు..చెత్త ఐడియాలు వేస్తే ఇలానే ఉంటది..

    Ambati Tea Cups : ఐడియా అంటే కాస్టిలీగా ఉండాలి కానీ...

    TDP Blocking Ambati Convoy : ఖమ్మంలో అంబటి కాన్వాయ్ ను అడ్డుకున్న టీడీపీ  

    TDP Blocking Ambati Convoy : ఏపీ నీటి పారుదల శాఖ...

    Minister Ambati : మంత్రి అంబటికి మహిళల షాక్.. సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ..

    Minister Ambati : ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు సొంత నియోజకవర్గంలోనే నిరసనలు...