31.3 C
India
Wednesday, June 26, 2024
More

    Ranbir Kapoor : రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రణ్ బీర్.. ప్రజలను మోసం చేస్తున్నారా?

    Date:

    Ranbir Kapoor
    Ranbir Kapoor

    Ranbir Kapoor : భారత ఇతిహాసం అయిన ‘రామాయణం’ భారతీయులతో పాటు ఇతర దేశాలకు కూడా పవిత్రమైనది. సకలగుణాభి, మర్యాద పురుషోత్తముడు అయిన రాముడి పాత్రలో నటించాలంటే నటులు రాసుకొని పుట్టాలి. ఇప్పటి వరకు ఎంతో మంది రాముడి పాత్రలో నటించారు. ప్రతీ సినిమా, టెలివిజన్ సీరియల్ లో రామాయణం చేసిన సమయాల్లో ఎన్ని అలవాట్లు ఉన్నా పక్కన పెట్టడం నటులకు ఆనవాయితే.

    నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణంలో రాముడి పాత్రను రణ్ బీర్ చేస్తున్నాడు. సినిమా పూర్తయ్యే వరకు మద్యం, ధూమపానం, మాంసాహారం లాంటివి రణ్ బీర్ మానేశానని గతేడాది వార్తలు వచ్చాయి.

    అయితే ఇటీవల జరిగిన అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో రణ్ బీర్ డ్రింక్ పట్టుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో రణబీర్ సుహానా ఖాన్ తో మాట్లాడుతుండగా, పక్కనే షనయా కపూర్, ముఖేష్, ఆకాష్ అంబానీ ఉన్నారు.

    ‘రణ్ బీర్ కపూర్ రామాయణం కోసం మద్యం మానేయడం కేవలం పీఆర్ చర్య మాత్రమే’ అంటూ ఓ నెటిజన్ ఈ ఫొటోను షేర్ చేశాడు. దీంతో ఇంకొక నెటిజన్ ‘అతను కూడా శాకాహారి కాబోతున్నాడు.. అతను తన ‘పెద్ద గొడ్డు మాంసం మనిషి’ ఇమేజ్ ను మరోసారి దక్కించుకోవాలని నేను అనుకుంటున్నాను. అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

    మూడో యూజర్ సరదాగా ‘ఇది జీడిపప్పు జ్యూస్. ఆయన పీఆర్ రాసిన వ్యాసాలు వస్తున్నాయి. విస్కీ గ్లాసులో టీ తాగుతున్నాడని అతని పీఆర్ చెబుతాడు’ అని మరొకరు తెలిపారు. కొందరు అభిమానులు రణ్ బీర్ ను సమర్థిస్తూ ఆ డ్రింక్ నాన్ ఆల్కహాలిక్ అంటూ కామెంట్స్ చేశారు.

    ప్రస్తుతం రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న రామాయణం చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. సీతగా సాయిపల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. రామాయణంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ అండ్ వార్’లో అలియా భట్, విక్కీ కౌశల్ జంటగా నటిస్తున్నారు రణ్ బీర్.

    Share post:

    More like this
    Related

    Aarogyasri Card : ఏపీ లో ఆరోగ్య శ్రీ కార్డుపై కీలక అప్‌డేట్

    Aarogyasri Card Update : సీఎం క్యాంపు ఆఫీస్ (సీఎంసీఓ) పేరుతో...

    Kalki 2898 AD : ఆ ముగ్గురిదే సినిమా అంతా..

    Kalki 2898 AD : బాహుబలి సిరీస్ తర్వాత  హిట్టు ఫ్లాపులతో...

    America : అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి

    America : అమెరికా లాస్ వెగాస్ లో ఓ అపార్ట్ మెంట్...

    TV-9 Rajinikanth : ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయికి దిగజారిపోయిన టీవీ- 9 రజనీకాంత్

    TV-9 Rajinikanth : జర్నలిస్టు రజనీకాంత్ అంటే గుర్తు పట్టరేమో కానీ.....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Priyanka Chopra : ప్రియాంక చోప్రా రెస్టారెంట్ క్లోజ్.. అసలేమైందంటే

    Priyanka Chopra Restaurant : ప్రియాంక చోప్రా బాలీవుడ్ ను దాటి...

    Guess this Photo : ఈ ఫొటోలో చిన్నారి ఇప్పుడు కేక పెట్టిస్తోంది.

    Guess this Photo : కొంతమంది హిరోయిన్లకు బ్యాక్ టు బ్యాక్...

    Viral News : ఈ చిన్నది ఇప్పుడు అందానికే అసూయ తెప్పిస్తున్నది..

    Janhvi Kapoor Childhood Pic, Viral News Viral News : సోషల్...

    Bollywood Actress : అప్పుడు రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు.

    Bollywood Actress Shilpa Shetty : సినీ పరిశ్రమ ఓ రంగుల...