27.8 C
India
Thursday, May 2, 2024
More

    Maheshbabu : తెలుగు సినిమాకు రూ. 78 కోట్లు! రికార్డు సృష్టించిన మహేశ్ బాబు

    Date:

    Maheshbabu
    Maheshbabu

    Maheshbabu  పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ స్థాయికి తెలుగు సినిమాలు చేరడంతో టాలీవుడ్ హీరోల గ్రాఫ్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. సినిమా, సినిమాకు రెమ్యునరేషన్ పెంచేస్తూ పోతున్నారు మన హీరోలు. దాదాపు తెలుగులో టాప్ హీరోల పారితోషికం రూ. 100 కోట్ల మార్కును దాటుతుందంటే ఆశ్యర్యం వేయకమానదు. కానీ ఒక హీరో సింగిల్ లాంగ్వేజ్ తెలుగు సినిమాకే రూ. 78 కోట్లు తీసుకొని మరో రికార్డ్ క్రియేట్ చేశాడు.

    గుంటూరు కారం సినిమాకు మహేశ్ బాబు రూ. 78 కోట్లు ప్లస్ జీఎస్టీ అని టాలవుడ్ లో ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. ఇది తెలుగు సింగిల్ లాంగ్వేజ్ సినిమా హీరోగా రికార్డు అని చెప్పాలి. టాలీవుడ్ లో చాలా మంది స్టార్లు పాన్ ఇండియా సినిమాలకు అంత వసూలు చేస్తారు. కానీ ఇప్పటి వరకు మహేశ్ బాబు మాత్రమే ఇంత మేరకు వసూలు చేస్తున్నారు.  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మార్కెట్ మొత్తం రూ. 250 కోట్లకు పైగా ఉంటుందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. నాన్ థియేటర్ హక్కుల రూపంలోనే రూ. 100 నుంచి రూ. 150 కోట్లు మధ్యలో ఆదాయం రావచ్చని అంచనాలు వేస్తున్నారు మేకర్స్.

    అడియో హక్కులకే రూ. 20 కోట్లకు పైగా కోట్ చేస్తున్నారు. నిజాం థియేటర్ హక్కులు రూ. 45 కోట్లు చెబుతున్నారు. ఈ లెక్కన ఆంధ్ర థియేటర్ కోసం రూ. 60 కోట్ల వరకు చెప్పే అవకాశం ఉంది. ఓవర్ సీస్ కు రూ. 20 కోట్లకు పైగా కోట్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ లెక్కగడితే టోటల్ మార్కెట్ వాల్యూ రూ. 250 కోట్లకు పైగానే ఉంటుంది. అందువల్ల మహేశ్ బాబుకు ఈ రేంజ్ రెమ్యూనిరేషన్ ఇవ్వడంలో నిర్మాతకు నష్టం ఏమీ ఉండదు.

    ఇటు త్రివిక్రమ్, అటు మహేశ్ బాబు ఇద్దరికీ ఈ మూవీ ఇంపార్టెంట్. ఎందుకంటే అలవైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ సినిమా లేదు. ఇక మహేశ్ బాబు ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా తీయనున్నారు. అంటే దాదాపు ఇండస్ట్రీ నుంచి రెండు, మూడు సంవత్సరాలు దూరం ఉండాల్సి వస్తుంది. అందువల్ల ఈ సినిమాపై వాళ్లే కాకుండా మేకర్స్ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

    త్రివిక్రమ్-మహేష్ అనే కాంబినేషన్ వల్లనే కదా ఇది అంతా. పైగా అలవైకుంఠపురములో సినిమా తరువాత వస్తోంది. ఈ సినిమా తరువాత మహేష్ సినిమా మరోటి థియేటర్లోకి రావాలంటే కనీసం ఏడాదిన్నర పడుతుంది. అందువల్ల అన్నీ కలిసి వచ్చాయి.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...

    Trivikram : త్రివిక్రమ్ ను ప్రశ్నించిన మహేష్ ఫ్యాన్స్!

    Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సినిమా...