IT Raids : పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతుంటే, ఉన్నోడు మాత్రం డబ్బును ఎక్కడ దాచాలో కూడా తెలియక సతమతమవుతున్నాడు. మామూలుగా అయితే డబ్బును ఇంటిలోని బీరువాలో దాచుకుంటాం. లేకపోతే బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం. కానీ, ఇంట్లో మంచం మీద పరుపులా పరచడం ఎక్కడా చూడలేదు. ఆగ్రాలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో ఈ దృశ్యాన్ని చూశారు. ఆగ్రాలోని ఓ షూ వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేయగా కట్టల కొద్దీ డబ్బు బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా రూ. కోట్లు దొరికింది.
మంచం మీద పరిచిన నోట్ల కట్టలను చూచిన అధికారులు అవాక్కయ్యారు. కట్టలు కట్టలుగా బయటపడ్డ డబ్బును అధికారులు సీజ్ చేశారు. శనివారం రాత్రి ఆరు చోట్ల జరిపిన సోదాల్లో బయటపడ్డ డబ్బును లెక్కపెట్టడానికి 6 కౌంటాంగ్ మిషన్లు కావలసి వచ్చింది. ఈ సోదాల్లో 60 కోట్ల నగదుతో పాటు పలు డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.