32.5 C
India
Wednesday, June 26, 2024
More

    ‘ది కేరళ స్టోరీ’పై ఎందుకంత వివాదం.. అసలేంటీ ఈ సినిమా..

    Date:

    The-Kerala-Story
    The-Kerala-Story

    తప్పిపోయిన అమ్మాయి ఇతివృత్తంతో ‘ది కేరళ స్టోరీ’ తెరకెక్కింది. అయితే దీనిపై కేరళలో ప్రస్తుతం దుమారం చెలరేగుతోంది. రాష్ర్టంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే ఈ సినిమాను తెరకెక్కించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    మే 5న విడుదల కానున్న సినిమా ‘ది కేరళ స్టోరీ’పై కేరళలోని ప్రభుత్వా పక్షం, ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది రాష్ర్టంలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని, దీన్ని రిలీజ్ చేయద్దని మొత్తుకుంటున్నాయి. దీనిపై సాక్షాత్తు సీఎం స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం విడుదలను అడ్డుకొని తీరుతామని ప్రభుత్వం, ప్రతి పక్షంలోని కొన్ని పార్టీలు హెచ్చరిస్తుంటే. విడుదల చేసి తీరుతామని కొందరు ఘంటా పథంగా చెప్తున్నారు. అసలు ‘ది కేరళ స్టోరీ’పై ఇంత దుమారం ఎందుకు రేగుతోంది. దీన్ని ఒక సారి పరిశీలిద్దాం.

    డైరెక్టర్ సుదీప్తోసేన్ దర్శకత్వంలో ‘ది కేరళ స్టోరీ’ తెరకెక్కింది. ఆ రాష్ర్టంలో 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లుగా వస్తున్న ఆరోపణల బేస్ గానే ఈ చిత్రం నిర్మించారు. 32 వేల మంది మహిళల్లో ఉన్న ఒక నలుగురి స్టోరీని ప్రధాన కథాంశంగా తీసుకున్నాడు దర్శకుడు. నలుగురు యువతులు మతం మారి ఐసిస్ లో చేరి ఇండియాతో పాటు ప్రపంచంలోనే తీవ్రమైన ఉగ్రవాదులుగా మారడాన్ని ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు నిర్మాతగా అమృత్ పాల్ వ్వవహరించారు. ఆదా శర్మ ఇందులో లీడ్ రోల్ చేస్తుంది.

    మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసేందుకే ఈ చిత్రం నిర్మించారని, ట్రైలర్ చూస్తే అదే అర్థం అవుతుందని సీఎం పినరయి విజయన్ మడిపడుతున్నారు. లవ్ జిహాద్ నేపథ్యలో దీన్ని తెరకెక్కించినట్లు ఆయన ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని న్యాయ స్థానాలు తిరస్కరించినా కావాలనే దర్శకుడు ఇదే కథను ఇతి వృత్తంగా తీసుకొని సినిమా తీయడం సమాజానికి మంచిది కాదని చెప్పారు.

    రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఇలాంతి సినిమాలు తెస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమా ఇక్కడ ప్రదర్శనకు అనుమతించేది లేదని తేల్చి చెప్పాడు. ఈ చిత్రంపై కాంగ్రెస్ కు కూడా గుస్సుగా ఉంది. ఈ విషయంలో సీఎంతో తాము ఏకీభవిస్తున్నట్లు అక్కడి కాంగ్రెస్ నాయకులు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో కేరళకు చెడ్డ పేరు తెచ్చేలా ఈ సినిమా తీశారని కాంగ్రెస్ సినియర్ నాయకుడు వీడీ సతీశన్ అన్నారు.’

    స్పందించిన డైరెక్టర్..

    ఈ వివాదాలపై డైరెక్టర్ స్పందించారు. ట్విటర్ వేధికగా ఒక మెసేజ్ పెట్టాడు. ‘ప్రియమైన కేరళ వాసులారా అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న మీరు కుంచిత భావంతో ఉండకూడదు. సినిమా రిలీజ్ కాకముందే ఇలాంటి భావనకు ఎలా వస్తారు. ఇది మంచిది కాదు. మొదలు సినిమా రిలీజ్ కానివ్వండి. తర్వాత అందులోని అంశాలపై చర్చిద్దాం. ఈ సనిమా కోసం కేరళలోనే 7 సంవత్సరాలు పని చేశాను. నేను మీలోని వాడినే’ అంటూ ట్వీట్ చేశాడు.

    ఇక ‘ది కేరళ స్టోరీ’కి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న రిలీజ్ చేశారు. ట్రైలర్ విడుదల నుంచి దీనిపై వివాదం మొదలైంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ అనుమతి కూడా రావడంతో మే5ను విడుదల తేదీగా నిర్ణయించింది చిత్ర యూనిట్.

    Share post:

    More like this
    Related

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్...

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vishwak Sen Vs Sai Rajesh: విశ్వక్ సేన్ తో వివాదంలో అసలు విషయాలు బయటపెట్టిన సాయి రాజేష్

    Vishwak Sen Vs Sai Rajesh: ప్రస్తుతం బేబి సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది....

    Karimnagar : కరీంనగర్ ప్రజలకు సారీ.. చెప్పిందెవరంటే?

    Karimnagar People : కరీంనగర్ ప్రజలకు ఓ ప్రముఖ దర్శకుడు క్షమాపణలు...

    Gujarat Story : కేరళ స్టోరీని మించిన గుజరాత్ స్టోరీ… 40 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్

    The Gujarat Story : ‘ది కేరళ స్టోరీ’ అక్కడ ప్రభుత్వాన్ని...

    ‘ది కేరళ స్టోరీ’ 4 రోజుల వసూళ్లు.. బాక్సాఫీస్ పై దండయాత్ర!

    The Kerala Story Collections : ఇప్పుడు సినిమాల్లో దేశ వ్యాప్తంగా...