38 C
India
Saturday, May 25, 2024
More

    Canada : విదేశీ విద్యార్థులకు కెనడా షాక్.. 2024 నుంచి ఏం చేస్తుందంటే?

    Date:

    canada
    canada big shock to students

    Canada : విదేశీ వ్యవహారాల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందా? అంటే అవుననే ఆ దేశ మంత్రులు అంటున్నారు. 2024 తర్వాత విదేశీ ఉద్యోగులు, విద్యార్థుల ఎంట్రీని కట్టడి చేయాలని ఆ దేశం యోచిస్తోంది. పూర్తిగా కాకుండా కొన్ని పరిమితులు విధించాలని అనుకుంటుంది. ఈ మేరకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ స్పష్టం చేశారు. విదేశీ ఉద్యోగుల భారీ ప్రవాహాన్ని తగ్గించేందుకు వచ్చే ఏడాది (2024) ప్రారంభంలో కొన్ని సంస్కరణలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    కెనడాలో తలెత్తిన హౌసింగ్‌ సంక్షోభం, విదేశీ విద్యార్థులు, విదేశీ కార్మికులు పెద్ద సంఖ్యలో రావడం మధ్య తీవ్ర వ్యత్యాసం ఉందని మిల్లర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన కెనడాలోకి ప్రవేశించిన వారి సంఖ్య పెరిగిందన్నారు. దీనికి నిర్ధిష్టంగా ఎవరూ లక్ష్యం కారని ఆయన పేర్కొన్నారు.

    విద్యార్థుల రూపంలో..
    కెనడాలో చాలా కాలంగా విదేశీ కార్మిక వ్యవస్థలో అస్థిరత నెలకొందని ఈ పరిణామాల నేపథ్యంలో వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు మిల్లర్ చెప్పారు. వ్యవసాయ కార్మికులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్లను పొందిన విద్యార్థుల రూపంలో తాత్కాలికంగా విదేశీ కార్మికులు దేశంలోని ప్రవేశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    పెరుగుతున్న జనాభా
    కెనడాలో జనాభా క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2023 మూడో త్రైమాసికంలో ఆ దేశ జనాభా 4.3 లక్షలకుపైగా పెరిగింది. ఈ సంఖ్యలను కెనడా స్టాటిస్టిక్స్ ఇటీవలి పేర్కొంది. ఇది వెల్లడైన వారంలోగా మిల్లర్ ఈ వ్యాఖ్యలు చేశారు. త్రైమాసాన్ని తీసుకుంటే 1957 తర్వాత అత్యధిక జనాభా పెరుగుదల రేటు ఇదే నని తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం 4 కోట్లకుపైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో 3.13 లక్షల మంది వలసదారులే కావడం గమనార్హం.

    విద్యార్థులపై కెనడా ప్రభుత్వం గతంలోనే కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇతర దేశాల నుంచి వారి దేశంలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల డిపాజిట్‌ మొత్తాన్ని పెంచింది. ప్రస్తుతం ఆ మొత్తం 10 వేల డాలర్లు (రూ.6.14లక్షలు) ఉండగా ట్రూడో ప్రభుత్వ 20,635 డాలర్లు (రూ.12.7లక్షల)కు పెంచింది. 2024, జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ట్రూడో ప్రభుత్వం పేర్కొంది.

    Share post:

    More like this
    Related

    Kharge : మన భూభాగాలను చైనా ఆక్రమించింది.. అయినా పీఎం మౌనం: ఖర్గే

    Kharge : భారత్ భూభాగాలను చైనా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా పీఎం...

    Mallareddy VS Revanth : మల్లారెడ్డిపై రేవంత్ పగబట్టారా..?

    Mallareddy VS Revanth Reddy : పాలమ్మిన.. పూలమ్మినా అంటూ ఓ...

    Comedy : జంధ్యాల మార్క్ కామెడీ పంచ్ లు..నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత..

    Comedy : నవ్వు నాలుగు విధాల చేటు కాదు..నలభై విధాల మేలు...

    MLC by-Election : తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం

    MLC by-Election MLC by-Election : ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు..

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో కెనడాలో...

    Canada : కెనడా వెళ్లనంటున్న భారత విద్యార్థులు.. ఎందుకంటే?

    Canada : ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత...