- ‘కూలీ’ సినిమాకు రజనీకాంత్ పారితోషికం
Super Star Rajinikanth : భారతదేశంలో సినిమాల బడ్జెట్ ఆకాశాన్ని తాకుతోంది. ఒకప్పుడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఒక సినిమా తీస్తున్నారంటే, అందరూ గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఇదంతా కామన్ అయింది. సినిమాల రేంజ్ పెరిగిపోయింది. దీంతో హీరోల రెమ్యనరేషన్ భారీగా పెరిగింది. ఇప్పుడు 100 కోట్ల పారితోషికం కామన్ అయింది.
అయితే ఒక హీరో ఓ సినిమాలో నటించేందుకు ఏకంగా రూ.280 కోట్లు తీసుకుంటున్నాడు. అది ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి రజనీకాంత్ ఏకంగా రూ.260 నుంచి రూ.280 కోట్లు వరకూ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇదే నిజమైతే ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా రజనీకాంత్ నిలుస్తారు.ఇటీవల విడుదల చేసిన కూలీ టీజర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా 2025లో విడుదల కానుంది.
రజనీకాంత్ నటించిన ఎన్నో సినిమాలు దేశవ్యాప్తంగా హిట్టయ్యాయి. ఆయన అప్పుడు, ఇప్పుడు ఒకే రకమైన స్టైల్, క్రేజ్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన వయసు 73 ఏళ్లు. అయినప్పటికీ వరుస సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. ఈ వయసులో దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా రికార్డు సృష్టిస్తున్నారు.