పవన్ కల్యాణ్‌తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు..జనసేన ఏ బాధ్యతలు అప్పగించినా ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని మాజీ మంత్రి కొణతాల తెలిపారు. నా సేవలు ఎలా ఉప యో గించుకోవాలన్నది జనసేన ఇష్టం అని ఆయన తెలిపారు. నేను ఎక్కడి నుంచి పోటీ చేయాల న్నది కూడా పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై పవన్ కల్యాణ్‌తో చర్చించానని.. వచ్చే నెల మొదటి వారంలో అనకాపల్లిలో భారీ సభ ఉంటుందని కొణతాల రామకృష్ణ తెలిపారు. మెత్తం మీద జనసేన లోకి వలసల పర్వం కోనసాగుతుందనే చెప్పవచ్చు. రాష్ట్రంలో ఉన్న సీనియర్ నేతలు అంతా జనసేన, టిడిపి వైపు చూస్తున్నారు. ఈ నేపద్యంలోనే సీనియర్ నేత మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Breaking News