
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటి క్రితం కీరవాణి తల్లి మరణించింది. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కీరవాణి తల్లి. దాంతో ఈరోజు ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దాంతో కీరవాణి కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది.
కీరవాణి తల్లి అంత్యక్రియలు రేపు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానం లో జరుగనున్నట్లు తెలుస్తోంది. మహా ప్రస్తానంలో చేయాలా ? లేక ఫామ్ హౌజ్ లో చేయాలా ? అని చర్చించారట. అయితే ఫామ్ హౌజ్ సిటీకి దూరంగా ఉండటంతో ఇక్కడే చేస్తే బాగుంటుందని భావించారట. ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళికి పెద్దమ్మ అవుతుంది కీరవాణి తల్లి. దాంతో కీరవాణితో పాటుగా రాజమౌళి కుటుంబంలో కూడా విషాదం నెలకొంది.