- ఈ రోజు విచారణకు రాలేనని లేఖ

MP Avinash : సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి డుమ్మా కొట్టారు. అత్యవసర పనులు ఉన్నందున మరో నాలుగు రోజులు అందుబాటులో ఉండనని చెప్పారు. హైదరాబాద్ నుంచి కడపకు బయల్దేరి వెళ్లినట్లుగా సమాచారం. నాలుగు రోజుల తర్వాత విచారణకు వస్తానని లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే విచారణకు రానని అవినాష్ లేఖను సీబీఐ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.. ఈరోజు అవినాష్ అరెస్ట్ ఉంటుందని అంతా భావిస్తున్న నేపథ్యంలో సీబీఐకి షాక్ ఇస్తూ అవినాష్ కడప బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తున్నది. ఈమేరకు జూబ్లీహిల్స్ లోని తన నివాసం ముందు మీడియాతో మాట్లాడి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు ఎంపీ అవినాష్ నివాసానికి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. వారంతా అవినాష్ కు మద్దతుగా నినాదాలు చేశారు.
విచారణ ఎందుకంటే..