23.6 C
India
Monday, July 8, 2024
More

    Virat Kohli and Rohit : ఇంతకముందెన్నడూ చూడని విజయోత్సవం.. డ్యాన్సులతో అదరగొట్టిన కోహ్లీ, రోహిత్

    Date:

    Virat Kohli and Rohit
    Virat Kohli and Rohit

    Virat Kohli and Rohit Sharma : 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ టైటిల్‌ను గెలుచుకున్న టీమిండియా స్వదేశానికి రాగా,  ఘనస్వాగగతం లభించింది. వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా జూలై 4న స్వదేశానికి తిరిగి వచ్చింది.  వారికి లభించిన స్వాగతం కొన్నేళ్ల పాటు గుర్తుండిపోతుంది. న్యూఢిల్లీలో దిగిన తర్వాత ముందుగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన టీమ్‌ ఇండియా, ఆ తర్వాత ముంబైకి చేరుకుంది. ఇక అక్కడి వాతావరణం చూస్తుంటే పండుగను తలపించింది.ఈ వేడుకలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి వాంఖడే స్టేడియంలో డ్యాన్స్ చేయడం  మరింత ఉత్సాహాన్ని నింపింది.

    ప్రపంచకప్ గెలిచి తర్వాత టీమ్ ఇండియా ప్లేయర్లు  స్వదేశానికి ఎప్పుడెప్పుడు వస్తారా అని క్రికెట్ క్రీడాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత, టీమిండియా కృషి ఫలించింది…  దేశం మొత్తం సంబురాల్లో మునిగితేలింది.  ముంబైలో, ముందుగా విజయోత్సవ ఊరేగింపు ఓపెన్ టాప్  బస్సులో వాంఖడే స్టేడియం వరకు సాగింది. వేలాది మంది అభిమానులు బస్సు వెంటే నడిచారు.

    వాంఖడేలో తొలిసారి
    విజయోత్సవ పరేడ్ పూర్తయిన తర్వాత వాంఖడే స్టేడియంలో వేలాది మంది అభిమానులు టీమ్ ఇండియా  క్రీడాకారులను కళ్లారా చూసేందుకు వేచి ఉన్నారు. టీమ్ ఇండియా ప్లేయర్లు స్టేడియం లోపలికి చేరుకోగానే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. టీమ్ ఇండియా, ఆటగాళ్ల పేరుతో నినాదాలు చేశారు. వారు మైదానంలోకి దిగిన వెంటనే, విరాట్ కోహ్లీ నాసిక్‌లోని ప్రసిద్ధ డ్రమ్మర్లు ప్రదర్శన ఇస్తున్న అభిమానుల వద్దకు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా మొత్తం జట్టును తీసుకెళ్లాడు. తర్వాత కోహ్లీ, రోహిత్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. వారిని చూసి మిగతా టీమ్ సభ్యులు కూడా ఆగలేక డ్యాన్స్ చేయడంతో స్టేడియం అంతా ఊగిపోయింది. రోహిత్, కోహ్లి కలిసి డ్యాన్స్ చేయడాన్ని తొలిసారిగా చూసే అవకాశం భారత అభిమానులకు దక్కింది.

    ప్రతిధ్వనించిన వందేమాతరం

    జస్ప్రీత్ బుమ్రా కూడా ఈసారి డ్యాన్స్ చేయడం కనిపించింది. బహుశా మొదటిసారిగా, జట్టు అంతా ఇలా డ్యాన్స్ చేయడం అభిమానులకు చూసే అదృష్టం కలిగింది. ఇది అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. వేడుక ముగిసిన తర్వాత, టీమ్ ఇండియా మైదానం చుట్టూ తిరిగింది.  మరోసారి విరాట్ మొత్తం టీమ్‌ తో  కలిసి ఏఆర్ రెహమాన్ స్వరపర్చిన  ‘వందేమాతరం’ని పాడమని కోరాడు. అభిమానులు కూడా ఈ పాటను ఆలపించడంతో స్టేడియం అంతా ప్రతిధ్వనించింది.

    Share post:

    More like this
    Related

    Hathras Incident : హత్రాస్ ఘటన.. ‘బోలేబాబా’ లాయర్ ఆరోపణలు

    Hathras Incident : హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించి బోలేబాబా న్యాయవాది సింగ్...

    Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు

    Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి మరోసారి...

    Kalki Collections : కల్కి లో నైజాం, సీడెడ్ లో రికార్డు కలెక్షన్లు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

    Kalki Collections : రెబల్ స్టార్ ప్రభాస్ తన మూవీ కల్కితో...

    CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mumbai Metro : ముంబై మెట్రోలో మహిళ వల్గర్ డ్యాన్స్.. రైల్వేశాఖ సీరియస్

    Mumbai Metro : తాజాగా ముంబై మెట్రోలో భోజ్ పురి పాటకు...

    Mumbai : యువకుడితో కలిసి లగ్జరీ కారుతో ‘మైనర్’ వీరంగం.. తండ్రి అరెస్టు

    Mumbai : ఓ మైనర్ బాలుడు లగ్జరీ కారు నడుపుతుండగా.. మరో...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Mumbai: ముంబై అటల్ సేతు బ్రిడ్జ్ పై తొలి ప్రమాదం…అక్కడ డ్రైవింగ్‌లో జాగ్రత్తగా ఉండండి!

    ముంబై: సముద్ర వంతెన ముంబై అటల్ సేతు బ్రిడ్జ్  మీదుగా ఒక...