Allu Arjun Role in Pushpa 2 :
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప2. ఇది ఇప్పటికే అభిమానుల అంచనాలు దాటిపోయింది. పుష్పతో రికార్డులు కొల్లగొట్టిన అల్లు అర్జున్ పుష్ప2 తో మరింత దూకుడు ప్రదర్శించనున్నాడు. ఎర్ర చందనం అక్రమ రవాణా చేసే కథతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. సినిమాలో అన్ని హైలెట్ గా నిలిచాయి.
పుష్ప 2 కూడా దానికి తగ్గకుండా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా లారీలతో జరిగే పోరాట సన్నివేశాలు చిత్రీకరించి సుకుమార్ హైదరాబాద్ లో ఓ పాట చిత్రీకరిస్తున్నాడు. అల్లు అర్జున్ కలప స్మగ్లర్లకు ఇచ్చే పార్టీగా ఈ పాట ఉండనుంది. పుష్ప రూ.350 కోట్లు రాబట్టింది. ఇక పుష్ప2 వెయ్యి కోట్లు సాధిస్తుందని చిత్రం యూనిట్ అంచనా వేస్తోంది. దీనికి ఏ మాత్రం తగ్గకుండా చూడాలనేది వారి ఆలోచన.
చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీంతో అనుకున్న దాని కంటే ముందే సినిమా విడుదల చేయాలని చూస్తున్నా 2024లో వేసవి సెలవులకు దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పుష్ప2 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించనుందని టాక్. దీంతో సినిమా కూడా అలాగే కొనసాగుతోంది. అల్లు అర్జున్ కు ఇది మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అందరు అనుకుంటున్నారు.
పుష్పలో అల్లు అర్జున్ చెట్లు నరికే కూలీగానే కనిపించాడు. కానీ పుష్ప 2లో మాఫియా లీడర్ గా కనిపించనున్నాడు. కలప మాఫియాను శాసించే విలన్ గా కొత్త తరహాలో చూపించనున్నారు. మెయిన్ విలన్ రోల్ లో మాయచేయనున్నాడు. మైత్రీ మూవీస్ మేకర్స్ సినిమాను నిర్మిస్తుండగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప కంటే పుష్ప 2 వండర్ క్రియేట్ చేస్తుందని అందరు చెబుతున్నారు.