Vanabhojanam : ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడో సినీ కవి. మనం ఖండాంతరాలు దాటినా మన సంప్రదాయాలు మరచిపోకూడదనే ఉద్దేశాన్ని విదేశాల్లో ఉంటున్న వారు సైతం మరిచిపోవడం లేదు. కానీ మనమే పూర్తిగా మరిచిపోతున్నాం. దేశాలు దాటినా మన ఆచారాలు మాత్రం వారు మన సంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు. విదేశాల్లో ఉన్నామని మన ఆచారాలను నిర్లక్ష్యం చేయడం లేదు. నిరంతరం వాటిని గుర్తు చేస్తూనే ఉన్నారు.
తాజాగా చికాగోలో మన తెలుగువారు వన భోజనాలకు వెళ్లనున్నారు. అక్కడున్న మన దేశంలోని ఆచారాలను చిన్న చూపు చూడటం లేదు. ఇక్కడి పండగలను వారు తలుచుకుంటూ అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఆనందాలు పంచుకోవడం సహజమే. ఇప్పుడు వారందరు కలిసి వన భోజనాలకు వెళ్లి పసందైన వంటలు చేసుకుని ఆహ్లాదకరంగా గడపాలని నిర్ణయించుకున్నారు.
మన ఇక్కడి ఆచారాన్ని అక్కడ కూడా పాటిస్తున్నారు. దేశాలు దాటినా మన ప్రాంత పండుగలను జరుపుకుంటూ ఇక్కడ ఉన్నట్లుగానే ఫీలు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వారు మన పండుగలను తలుచుకుని ఆనందంగా గడపనున్నారు. రకరకాల వంటలు చేసుకుని అందరు ఎంతో ఇష్టంగా తింటూ మన ప్రాంతాన్ని తలుచుకోవడం విశేషం. ఆగస్టు 5, శనివారం రోజు అందరు వనభోజనాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఆహ్వాన పత్రికలు కూడా పంచారు. బసీవుడ్స్ ఫారెస్ట్, ప్రిసర్వ్, షెల్టర్, ఎల్క్ గ్రోవ్ విలేజ్ సౌత్ ఈస్ట్ కార్నర్ వేదికలుగా మారనున్నాయి. దీంతో అందరు హాజరు కావాలని కోరారు.