Pawan జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతు పెరుగుతోంది. అటు చిరంజీవి తన తమ్ముడికి అవకాశం ఇవ్వాలని కోరడంతో రాజకీయాల్లో మార్పులు రానున్నాయని చెబుతున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి సైతం పవన్ కల్యాణ్ డబ్బు మనిషి కాదని చెప్పడం గమనార్హం. రాజకీయాల కోసం తమ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆమె చెప్పడం విశేషం.
ఈనేపథ్యంలో పవన్ కల్యాణ్ కు పరోక్షంగా కుటుంబ మద్దతు రావడం చూస్తుంటే పవన్ కు బలం పెరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలని రేణుదేశాయి కోరుతోంది. పవన్ కల్యాణ్ నైతికంగా గొప్ప ఆశయాలున్న వ్యక్తి. ఆయనకు ఓ సారి అవకాశం ఇస్తే ఆయన పరిపాలన చూస్తే ప్రజలు ఫిదా అవడం ఖాయమే అంటున్నారు.
రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఆశయాలు గొప్పగా ఉంటాయి. ఆయన నైతికత కూడా మంచిది. అందుకే ఆయనకు రాజకీయాల్లో ఓ సారి అవకాశం ఇస్తే పరిపాలనలో ఆయన సత్తా ఏమిటో తెలుస్తుంది. పవన్ కల్యాణ్ కు ఇంటా బయట మద్దతు పెరుగుతోంది. వైసీపీ పాలన పట్ల విసుగు చెంది ఉన్న జనం పవన్ కల్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలనే వారి సంఖ్య కూడా పెరుగుతుంది.
చిరంజీవి కూడా పవన్ కల్యాణ్ కు ఓటు వేయాలని చెప్పడంతో మెగా కుటుంబం పవన్ కు దగ్గరవుతోంది. ఇప్పటికే నాగేంద్ర బాబు పార్టీలో చురుకుగా ఉన్నారు. పార్టీ నేతలతో మాట్లాడుతూనే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను చక్కబెడుతున్నారు. మరోవైపు రేణు దేశాయి కూడా పవన్ కు మద్దతు ఇస్తున్న క్రమంలో వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బలం మరింత పెరగనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.