27.8 C
India
Thursday, May 2, 2024
More

    Confusion in T BJP : టీ బీజేపీలో అయోమయం.. కమలవికాసం కష్టమేనా..?

    Date:

    Confusion in T BJP : తెలంగాణ బీజేపీలో పూర్తి అయోమయం నెలకొంది.  పార్టీలో ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టంగానే ఉంది. పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇప్పటికే చేతులెత్తేసినట్లు సమాచారం.అసలే బలమైన అభ్యర్థులు లేరంటే, మొదటి జాబితా ప్రకటన కూడా అత్యంత పేలవంగా ఉంది. దీంతో పార్టీ నేతలు కొందరు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇప్పటికే కోమటిరాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమైపోయింది.

    ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి టికెట్ ఆశించిన మాజీ ఎంపీ వివేక్ కు బీజేపీ అక్కడ కాకుండా చెన్నూర్ నియోజకవర్గాన్ని కేటాయించింది. దీనిపై ఆయన కూడా కొంత నిరాశతో ఉన్నారు. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య కూడా బీజేపీ ని వీడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మునుగోడు లేదా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి తనకు టికెట్ కేటాయించాలంటూ ఆయన కోరారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆయనకు ఇప్పటివరకు ఎక్కడా టికెట్ ప్రకటించలేదు.

    మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి పోటీ పడుతున్న మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇద్దరు పార్టీకి తలనొప్పిగా మారారు. గద్వాలలో సీనియర్ న్యాయవాది అయిన వెంకటాద్రి రెడ్డి నిలబెట్టి, తనకు ఎంపీగా అవకాశమివ్వాలని ఆమె కోరుతున్నారు. ఇక జితేందర్ రెడ్డి కూడా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీలో ఇప్పుడు అసంతృప్త జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇక ఎన్నికల ముందు ఇది అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Congress in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ కు అడ్వాంటేజ్.. రోజు రోజుకు బలహీన పడుతున్న బీఆర్ఎస్

    Congress in Telangana : చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని భారత...

    Telangana BJP : తెలంగాణలో పది సీట్లపై కాషాయ పార్టీ నజర్.. గెలుపుపై ధీమా..

    Telangana BJP : రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కనీసం...

    Parliament Elections : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో స్పీడ్ పెంచిన బీజేపీ నేతలు

    Parliament Elections : రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగా...

    Telangana BJP : మీవల్లే ఓడింది.. కాదు మీవల్లే.. టీ బీజేపీలో ఆరని మంటలు..!

    Telangana BJP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మింగుడుపడడం...