MS Dhoni టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనిది మొదట సాధారణ కుటుంబం. మధ్యతరగతి నుంచి వచ్చిన వాడే. సినిమా కష్టాలు పడిన వాడే. కానీ లక్ కలిసొచ్చి టీమిండియా కెప్టెన్ గా ఎదిగాడు. తన ఎదుగుదలకు అక్క, బావ, అన్న ముగ్గురు చేయూతనిచ్చారు. ధోని తండ్రి సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. కుటుంబాన్ని నడిపేందుకు నానా కష్టాలు పడేవాడు.
ఆ సమయంలో ధోని క్రికెటర్ అవుతానని చెబితే లేనిపోని కోరికలు మనకెందుకు అని నిరుత్సాహ పరిచేవాడు. కానీ అక్క జయంతి గుప్తా, అన్న నరేంద్ర సింగ్ మాత్రం అతడికి అండగా నిలిచే వారు. పేదరికలో పుట్టడం తప్పు కాదు. పేదరికంలోనే చావడ తప్పు అన్నట్లు ధోనిని వారు నిరంతరం ముందుకు తీసుకెళ్లేవారు. అలా అతడు టీమిండియా జట్టు కెప్టెన్ గా ఎదిగాడు.
మూడు కప్ లు తీసుకొచ్చి లెజెండరీ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ధోని సంపాదన చేస్తే ఆశ్చర్యం వేస్తుంది. దాదాపు రూ. వెయ్యి కోట్లు అతడి సంపాదన. ఏడాదికి రూ. 50 కోట్లు వెనకేస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదు సార్లు కప్ తీసుకొచ్చి తన సత్తా చాటాడు. అత్యంత ధనవంతుడిగా ఎదిగి ప్రస్తుతం సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు.
ఇంత స్టార్ గా ఎదిగిన ధోని తన అక్క, అన్న కోసం ఏమాత్రం సాయం చేయలేదు. అక్క ప్రస్తుతం ఓ పబ్లిక్ స్కూల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. అన్న నరేంద్ర సింగ్ సాధారణ జీవితమే గడుపుతున్నాడు. అలా అతడిని పైకి తీసుకొచ్చిన వారినే మరిచిపోయిన ధోని గుణం చూసి అందరు తిట్టుకుంటున్నారు. తన ఎదుగుదలకు సహకరించిన వారిని పట్టించుకోని ధోని స్వార్థ బుద్ధికి ఆశ్చర్యపోతున్నారు. వారిని ఆదుకుంటే ఏమయ్యేది అని నిట్టూరుస్తున్నారు.