
రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ప్రకటించింది. అయితే నోట్ల రద్దు విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. ప్రజలు నోట్లను ఏ బ్యాంకులోనైనా డిపాజిట్ చేయడం ద్వారా మార్చుకోవచ్చని పేర్కన్నారు. ప్రజలు రూ. 2వేల నోట్లను సమీపంలోని బ్యాంకులో ఒకేసారి రూ. 20,000 వరకూ మార్చుకోవచ్చని ఆర్బీఐ అధికారులు సూచించారు.
నోట్లను మార్చుకునేందుకు నాలుగు నెలల సమయం ఇవ్వడంతో గడువు ముగిసే సమయానికి చలామణిలో ఉన్న నోట్లు ఆర్బీఐకి చేరుకుంటాయని, ప్రజలు బ్యాంకుల ముందు పెద్ద క్యూలు ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. కానీ అది జరగకపోవడంతో ప్రజలు బంగారం దుకాణాలకు పరుగులు తీస్తున్నారని సమాచారం. ఆర్బీఐ నుంచి రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటన రావడంతో బంగారం దుకాణాలు పెద్ద క్యూలు వెలుగు చూస్తున్నాయి. దన్ని ఎవరూ ఊహించలేదు. కొత్త నోట్లను ప్రవేశపెట్టడంతో చెలామణి కోసం రూ. 2000 నోట్లను ముద్రించామని, అవి మొదట్లో తగిన సంఖ్యలో లేవని ఆర్బీఐ తెలిపింది. మిగతా నోట్లు తగిన సంఖ్యలో ఉండడంతో పెద్ద నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
ప్రజలు బ్యాంకులకు వెళ్లకుండా బంగారు దుకాణాలకు వెళ్లి అక్కడ నగలు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కొన్ని షాపులు కొంత మొత్తాన్ని ఛార్జీగా వసూలు చేస్తున్నా ప్రజలు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60 వేలకు పైగా ఉండగా, వెండి కూడా గరిష్ట స్థాయిలో ఉంది. అయినప్పటికీ నగలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెద్ద నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన తర్వాత బంగారం దుకాణాల వద్ద క్యూలు పెరిగాయి.