39.8 C
India
Friday, May 3, 2024
More

    Lata Mangeshkar : నెహ్రూ నుంచి మోడీ వరకూ.. ఒక్క ఒక్క గాయని మన ‘లతా మంగేష్కర్’

    Date:

    Lata Mangeshkar : 2022 ఫిబ్రవరి 6న భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ మరణించినందుకు భారత ప్రభుత్వం రెండు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. దిగ్గజ గాయకురాలికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌లు సోషల్‌ మీడియా ద్వారా ఆమెతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతాపం తెలిపారు.

    లతా మంగేష్కర్ మధురమైన గాత్రం మనల్ని ఎన్నో ఏళ్లుగా అలరించింది. చాలా సంవత్సరాలుగా జనాలకు స్వాంతన చేకూర్చింది. ఎనిమిది దశాబ్దాలకు పైగా ఆమె కెరీర్‌లో సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలకు గొప్ప గుర్తింపు దక్కింది. రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీలు , అభిమానుల వరకు అందరూ లతా దీదీని అభిమానించారు. ఆమె ఇకపై మాతో ఉండకపోవచ్చు, కానీ ఆమె సంగీత వారసత్వం కొనసాగుతుంది.

    భారత మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో లతా మంగేష్కర్ తొలుత
    1963లో ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో కవి ప్రదీప్ రచించిన పాట ‘ఏ మేరే వతన్ కే లోగోన్’ పాటను లతా మంగేష్కర్ పాడారు. ఇది విని భావోద్వేగానికి గురైన జవహర్‌లాల్ నెహ్రూ కంటతడి పెట్టారు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ లతా మంగేష్కర్ “లతా, తుమ్నే ఆజ్ ముఝే రులా దియా” అని ప్రధానమంత్రిని ఉటంకించారు.

    ఇక ఆ తర్వాత లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వాజ్ పేయి, ప్రధాని నరేంద్రమోడీలతోనూ లతా మంగేష్కర్ కు అనుబంధం ఉంది. వారితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంది.

    ప్రధాని నరేంద్ర మోదీతో అనుబంధం ఉంది. ఆయనతోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నది. ఈమె మృతికి సంతాపం తెలుపుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో ఎమోషనల్ గా రాశారు. “నేను చెప్పలేనంత వేదనకు గురయ్యాను. దయ , శ్రద్ధగల లతా దీదీ మమ్మల్ని విడిచిపెట్టారు. ఆమె మన దేశంలో పూరించలేని శూన్యతను మిగిల్చింది. రాబోయే తరాలు భారతీయ సంస్కృతికి ధీటైన స్వరంతో ప్రజలను మంత్రముగ్దులను చేసే అసమానమైన సామర్థ్యం ఉన్న ఆమెను భారతీయ సంస్కృతికి గుర్తు పెట్టుకోండి. అని మోడీ ట్వీట్ చేశారు.

    ఇలా మొదటి ప్రధాని నుంచి ప్రస్తుత ప్రధాని వరకూ అందరితోనూ కలిసిన గొప్ప గాయనిగా ‘లత మంగేష్కర్ ’ ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    CAA : అసలు ఏంటి CAA బిల్లు.. ఈ పౌరసత్వ బిల్లు ఏమిటీ ఉపయోగం

    CAA : కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సీఏఏ పౌరసత్వ...

    CPI Ramakrishna : పథకం ప్రకారం చంద్రబాబుని జైలుకు పంపారు..

    CPI Ramakrishna : అవినీతి కేసులకు భయపడిన వాళ్ళే బీజేపీకి మద్దతిస్తున్నారని...