27.6 C
India
Wednesday, June 26, 2024
More

    Daggubati Purandeswari : చిన్నమ్మ చిటికేస్తే ఆంధ్రాలో ఊరువాడా కదిలింది

    Date:

    Daggubati Purandeswari
    Daggubati Purandeswari

    Daggubati Purandeswari : ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలే కాదు అధికార పక్షం వారు కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి సాహసించని పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి పాలనలో చోటుచేసుకుంది. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు విమర్శకుల పరిస్థితి అంతే. ప్రతిపక్షాలు రోడ్డు మీదకు వచ్చి నిరసన ప్రదర్శన జరిపినా, బంద్ కి పిలుపు ఇచ్చినా ఆఖరికి ఏకవచన ప్రయోగం చేసినా పరిణామం తీవ్రంగా ఉండేది. ముఖ్యమంత్రితో విభేదించిన ఎంపీ కి కూడా లాఠీ దెబ్బలు తప్పలేదు. అటువంటి స్థితిలో ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది ఓ మహిళ. ప్రభుత్వం సారా అమ్మకాన్ని ఆర్థిక వనరుగా చేస్తుందని విమర్శించింది. సారా అమ్మకం పేరిట వేల కోట్లు దోచేస్తున్నారని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పేరుపేరునా విమర్శలు గుప్పించారు. ఆమె భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి. చిన్నమ్మ అని పిలవబడే ఆమె వెనుక కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆమె చిటికేస్తే ఆంధ్ర ప్రదేశ్ లోని ఊరువాడా జనం కదిలారు. మట్టి-ఇసుక తవ్వకాలను, సారా అక్రమ అమ్మకాలను, కేంద్ర నిధులతో ప్రారంభమైన ప్రభుత్వ పథకాలను కేడర్ తో కలిసి పర్యవేక్షించారు. ప్రశ్నించారు, అవకతవకలను ఎత్తి చూపారు. అప్పటి వరకు ఉన్న భయం బళ్ళున బద్దలైంది. ఆమె స్ఫూర్తితో ప్రభుత్వ ఉద్యోగులు 23 సంఘాలు న్యాయమైన తమ కోర్కెల కోసం ఆందోళన చేపట్టారు. ఆమె బట్టబయలు చేసిన జగన్ సారా వ్యాపారాన్ని సమీక్షిద్దాం..

    ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు కోట్ల 34 లక్షలు, పురుషులు రెండు కోట్ల 67 లక్షలు, ప్ర.సా.దం దుకాణాలు 3,500

    ప్ర.సా.దం అంటే ప్రభుత్వ సారా దందాలు..

    – ఈ సార దందాలపై జగన్మోహన్ రెడ్డికి అందిన చీకటి ఆదాయం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు ప్రకారం అక్షరాల 30 వేల కోట్ల రూపాయల పైబడి..!

    – వాస్తవానికి 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపార లావాదేవీలను పరిశీలిస్తే దిగ్భ్రాంతి కలిగించే విషయాలు కనిపిస్తాయి.

    – 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వానికి సుంకం చెల్లించి, ప్రభుత్వం నిర్ధారించిన ధరలకు రకరకాల బ్రాండ్స్ అమ్మకాలు జరిపేవారు. 2019 నుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే నేరుగా సారాయి అమ్మకాలు జరుపుతోంది.

    – 3,500 దుకాణాలలో ఒక్కొక్క దుకాణంలో యావరేజ్ గా 1000 కేసులు అమ్మకాలు జరుగుతున్నాయి.

    – 2019 వరకు ఆంధ్రాలో అంతర్జాతీయ ఆదరణ పొందిన మెక్ డోవెల్ కంపెనీ ఆంధ్రాలో ఫెడరల్ ఇండస్ట్రీస్ పేరిట ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డి టోటల్ మార్కెట్ షేర్ 40 శాతం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ” 0 ” మార్కెట్ కి చేరింది.

    – 25 శాతం మార్కెట్ షేర్ ఉన్న సీగ్రామ్ 2019 నుంచి 2024 వరకు 10 శాతానికి పడిపోయింది.

    – ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ బీసీఎల్) సంస్థకు జగన్మోహన్ రెడ్డి హయాంలో కమిషనర్ గా వివేక్ యాదవ్ ఉన్నా మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న వాసుదేవరెడ్డిదే హవా.! పర్చేస్ ఆర్డర్స్ ఇచ్చేది ఈయనే.

    – యావత్ భారతదేశం డిజిటల్ చెల్లింపుల వైపు దూసుకెళ్తుంటే జగన్ రెడ్డి హయాంలో ఆంధ్రాలోని సారా దుకాణాలలో నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురందేశ్వరి హాస్పిటల్స్ సందర్శించినప్పుడు లివర్ దెబ్బతిన్న- జాండీస్ వ్యాధి బారిన బడిన రోగులను, చనిపోయిన వారి వివరాలను సేకరిస్తున్నప్పుడు ప్రభుత్వం వారి చీప్ లిక్కర్ – క్యాష్ పేమెంట్ బాగోతం బయటకు వచ్చింది. గణాంకాలు వెలుగుచూశాయి.

    – ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 100 డిస్టిలరీస్, బెవరేజెస్ ఉండగా కేవలం 19 కంపెనీలకి పర్చేస్ ఆర్డర్స్ ఇవ్వడం స్పైఆగ్రో వారికి దాదాపుగా 1863 కోట్ల రూపాయల మందుకి ఆర్డర్ ఇవ్వడం గమనించడం జరిగింది. అంతేకాదు చాలా షాపులలో లక్ష రూపాయల సేల్స్ జరిగితే 700 రూపాయల నుంచి వెయ్యి రూపాయలు వరకే బిల్స్ ఇవ్వడం జరిగింది.

    – తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వారి మాన్షన్ హౌస్, మంజీరా, ఎస్ ఎన్ జే తమిళనాడు కంపెనీ అందించే రాయల్ ప్యాలస్ బ్రాందీ/విస్కీ, బ్రిటిష్ ఎంపైర్ బీర్, బూమ్ బూమ్ ఎక్కువగా కొనేవారు. బాలయ్య బాబు బ్రాండ్ గా పేరొందిన మాన్షన్ హౌస్ చంద్రబాబు హయాంలో క్వార్టర్ 110 రూపాయలు మాత్రమే. ఇప్పుడు ఈ బ్రాండ్స్ స్టాక్ సగటు మనిషికి అందుబాటులో లేవు, ఉన్న ధరలు మూడు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం బాలయ్య బాబు బ్రాండ్ క్వార్టర్ 300 రూపాయలు.

    – ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అనుమతి ఇచ్చినవి 14 డిస్టిలరీస్. చిత్రం ఏమిటంటే స్పైఆగ్రో, విజయ డిస్టిలరీస్ తదితర ఫ్యాక్టరీలను మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, విజయ్ సాయి రెడ్డి తదితరులు బలవంతాన తమ బ్రాండ్ల లిక్కర్/బీర్ ఉత్పత్తిని కమిషన్ ప్రాతిపదికగా తయారుచేసి ఇచ్చేలా అంగీకరించేలా చేశారు. అంటే కంపెనీ వారిదే, యజమానులూ వారే. వారి పేరున పర్చేస్ ఆర్డర్స్ వస్తాయి. కానీ ఆర్డర్లు తెచ్చే మధ్యవర్తులు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు. ఏసీ బ్లాక్ రిజర్వ్ విస్కీ, అడాన్ సుప్రీం బ్లండర్ సుపీరియర్ గ్రీన్ విస్కీ, ప్రెసిడెంట్ మెడల్, క్రాఫ్ట్ ప్రీమియం విస్కీ ఇలా ప్రతి సంవత్సరం కొత్త కొత్త బ్రాండ్లు వెలువడుతున్నాయి. క్వాలిటీపై కంట్రోల్ లేదు. నగదు చెల్లింపులు

    -ఫ్యాక్టరీల నుంచి స్టాక్ ఏపీఎస్ బిసిఎల్ కి వెళ్లి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ జరగాలి. చంద్రబాబు హయాంలో కోట్ కంప్యూటర్స్ – ఆన్లైన్ లావాదేవీలు జరిపేవి. జగన్మోహన్ రెడ్డి హయాంలో “వశిష్ట” సాఫ్ట్వేర్ బెంగళూరు కేంద్రంగా పర్యవేక్షిస్తుంది. కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టిన వారు కేవలం కమిషన్ తీసుకుని ఆర్డర్ పై లిక్కర్/బీర్ తయారు చేసేవారిగా మిగిలిపోయారు. ప్రపంచం మార్కెట్ ఉన్న మెక్ డోనాల్డ్ బ్రాండ్ ఆంధ్రాలో కనిపించని పరిస్థితి. ఎంత లిక్కర్ తయారవుతోందీ- దుకాణాలకు ఎంత వెళ్తున్నది ప్రపంచానికి తెలియదు. కానీ లిక్కర్ తాగే మందు బాబులకి తాము తాగే లిక్కర్ క్వాలిటీ తెలుసు, తాము చెల్లించే ధరలు తెలుసు. మందుబాబులు 2024 ఎన్నికలలో అభ్యర్థులు ఇచ్చిన లిక్కర్ తాగారు, పెట్టిన బిర్యాని తిన్నారు, ఇచ్చిన డబ్బు తీసుకున్నారు. కానీ సరైన వాడికే సరైన సమయంలో ఓటేశారు.

    ఈ లిక్కర్ స్కామ్ ఆద్యాంతాలు అంత తేలిగ్గా బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. లిక్కర్ తయారీ కంపెనీలు, ఇథనాల్ కొనుగోలు చేస్తాయి. వంద లీటర్ల ఇథనాల్ తో 245-250 లీటర్ల లిక్కర్ తయారవుతుంది. కేసుకు తొమ్మిది లీటర్ల లిక్కర్ లేదా వశిష్ట సాఫ్ట్వేర్ మాత్రమే చెప్పగలదు.

    కంపెనీలు కొన్న ఇథనాల్ డేటా చెబుతుంది – ఏ కంపెనీ ఎంత లిక్కర్ తయారు చేసింది !

    “అమ్మ ఒడి- ఆసరా- చేయూత” సంక్షేమ పథకాల కోసమే ఈ సారా వ్యాపారం అంటున్నారు జగన్.

    ఆరోగ్యాన్ని హరించే చీప్ లిక్కర్ స్థానంలో క్వాలిటీ లిక్కర్ సరసమైన ధరలకు చంద్రబాబు ఇస్తారని మందుబాబులు ఆశపడుతున్నారు.
    మగాడు మందు మానలేడు, బాబు వస్తే కనీసం మంచి మందైన ఇస్తాడని ఆశపడుతున్న మహిళలకు “అమ్మఒడి- ఆసరా- చేయూత” కనిపించడం లేదు, మెడలోని మంగళసూత్రం మాత్రమే కనిపిస్తుంది.

    -70% మందుబాబులు ఓట్లు ఎవరికంటే..

    వారు ఊపిరి పీల్చుకోకపోయినా బతికేస్తారు, కానీ ముందుగా మందు వాసన, ఆపైన నాలుకపై చుక్క చుక్కగా చప్పరిస్తే గాని ప్రాణం నిలవదు. అటువంటి మందుబాబుల ఓట్లు ఎవరికి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మందు బాబు గారి భార్య ఓటేవరికో మరి..!

    Raghu Thotakura
    Raghu Thotakura
    -రఘు తోటకూర

    Share post:

    More like this
    Related

    Modi viral Pics : ఎమర్జెన్సీ సమయంలో వివిధ వేషధారణల్లో మోదీ.. వైరల్ ఫొటోలు

    Modi viral Pics : 70వ దశకంలో తనకు అధికారం అప్పగించరని...

    Tirupati Laddu : తిరుపతి లడ్డు నాణ్యత చాలా మెరుగు మెరుగుపడింది

    Tirupati Laddu : చాలాకాలం తర్వాత తిరుపతి లడ్డు నాణ్యత చాలా...

    Uttar Pradesh : పెళ్లి విందులో.. బిర్యానీలో లెగ్ పీస్ కోసం కొట్టుకున్నారు

    Uttar Pradesh : ఓ పెళ్లి వేడుకలో చికెన్ బిర్యానీ లెగ్...

    Rashmika Mandanna : రష్మికా ఈడా ఉంటా ఆడా ఉంటా.. అర డజన్ సినిమాలతో ఫుల్ బిజీ..

    Rashmika Mandanna : రష్మిక మందన్నా చేతి నిండా సినిమాలతో పూర్తి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hyper Aadi : నా పేరు ఆది.. నాది ఆంధ్రప్రదేశ్ నేను డిప్యూటీ సీఎం తాలూకా.. మళ్లీ రెచ్చిపోయిన హైపర్ ఆది

    Hyper Aadi : ఏపీ ఎన్నికల్లో విజయం తర్వాత పీపుల్స్ మీడియా...

    AP Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంను కలువనున్న తెలుగు నిర్మాతలు

    AP Deputy CM Pawan Kalyan : తెలుగు సినీ నిర్మాతలు...

    Change in Jagan : జగన్ లో ఆ మార్పునకు కారణం ఇదేనా..? ఎందుకిలా..?

    Change in Jagan : ఇటీవల ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. ఈ...