ROJA : నగరి ఎమ్మెల్యే రోజా.. ఏపీ రాజకీయాల్లో తనో ఫైర్ బ్రాండ్. టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది ఆమె. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు ఆమెకు మంత్రి పదవి వచ్చింది. టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడమే ఆమెకు మంత్రి పదవి రావడానికి కారణమని అంతా అనుకుంటుంటారు. అటు సినిమా రంగంతో పాటు ఇటు రాజకీయ రంగంలోనూ ఆమె రాణిస్తున్నారు. సొంత పార్టీ నేతలే తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇక్కడ కూడా ఆమెకు అదే పరిస్థితి ఎదురవుతున్నట్లు సమాచారం. నగరిలో ప్రస్తుతం తిరుగులేని నేతగా ఆమె ఉన్నారు. జగన్ ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. వైసీపీలో మంచి వాగ్ధాటితో ఆమె ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. చాలా మంది నేతలు ఆమె జోలికి వెళ్లేందుకు కూడా జంకుతారు.
అయితే మంత్రి అయ్యాక రోజా భారీగా ఆస్తులు కూడగట్టారని ప్రచారం జరుగుతున్నది. పెద్ద ఎత్తున స్థిరాస్తులు, భారీ ధరలతో కార్లు ఆమె వద్ద ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తు్న్నది. అత్యద్భుతమైన విల్లాలు ఆమె కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే మంత్రి అయ్యాక అక్రమ సముపార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబంతో కలిసి విదేశాలకు టూర్లు, వెళ్తుండడం లాంటివి కూడా ఇందులో ఉన్నాయి. అయితే గతంలో అప్పుల్లో ఉన్న ఆ కుటుంబం ఇంతలా సంపాదించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విలాసవంతమైన విల్లాలు, వాహనాలు ఇప్పుడు ఆమె సొంతమైనట్లు చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీ శ్రేణుల నుంచి ఆమె ఎదురుదాడిని ఎదుర్కొంటున్నారు. రోజా సంపాదించిన ఆస్తులపై వారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. రోజాకు ఎక్కడెక్కడ ఆస్తులు, విల్లాలు ఉన్నాయనేది పూర్తి వివరాలతో సహా వారు పోస్టులు చేస్తున్నారు. వీటికి కామెంట్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని రోజా అక్రమ సముపార్జనకు తెగించారని మండిపడుతున్నారు.