33.2 C
India
Saturday, May 4, 2024
More

    KCR Brahmastra : ప్రతిపక్షాలపై బ్రహ్మాస్త్రం ప్రయోగించనున్న కేసీఆర్.. మేనిఫెస్టోలో ఏముండబోతోందంటే..?

    Date:

    KCR Brahmastra
    KCR Brahmastra

    KCR Brahmastra : తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా రావచ్చు. ఇప్పటికే ఈసీ ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఆయా రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఢిల్లీలో శుక్రవారం సమావేశం నిర్వహించింది. రానున్న మూడు రోజుల్లో సెడ్యూల్ విడుదలవుతుందని సంకేతాలు కనిపిస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మేనిఫెస్టోను కూడా షెడ్యూల్ అనౌన్స్ కావడంతోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికీ అభ్యర్థుల ఎంపికలోనే తలమునకలయ్యాయి. దీంతో హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ ఫుల్ ధీమాతో ఉన్నారు. దీనిలో భాగంగానే ప్రతిపక్షాలపై బ్రహ్మాస్త్రం సంధించేందుకు సిద్ధం అవుతున్నారు.

    కర్ణాటక గెలుపుతో మరింత ఊపు మీదున్న కాంగ్రెస్ గెలుపు గుర్రాలను ప్రకటించడంలో తాత్సారం చేస్తున్నా.. గెలిచే వారి కోసం సన్నాహాలు చేస్తుంది. ఇక్కడ కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. కర్ణాటక తర్వాత తమకు ఇక్కడే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధిష్టానం భావించడంతో మరింత ఫోకస్ పెట్టారు పార్టీ పెద్దలు. ఇక మొదట్లో పోరాడి తర్వాత చతికిలపడ్డ బీజేపీ తాము కూడా పోటీలో ఉన్నామని ఇటీవల ట్రైబల్ యూనివర్సిటీ, పసుపు బోర్డును ప్రకటించారు. ఇవన్నీ నిశితంగా గమనిస్తున్న కేసీఆర్ భారీ ఎత్తు వేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.

    ఎలాగైనా హ్యాట్రిక్ సాధించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. దీనిలో భాగంగా చేవెళ్ల డిక్లరేషన్ ను తలదన్నేలా పథకాలు ఉండాలని భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంక్ ను తన వైపునకు తిప్పుకునేలా కీలక ప్రకటన చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రైతులు, యువతను కూడా దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మేనిఫెస్టోలో పెట్టిన పథకాల ఖర్చు విషయంలోనే ఆలోచిస్తున్నారని పార్టీ నుంచి లీకులు వినిపిస్తున్నాయి.

    వృద్ధాప్, వితంతు పింఛన్లుకు రూ. 1000 పెంచే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనితోపాటు ఒంటరి మహిళా పింఛన్, రైతు పింఛన్‌, గ్యాస్‌ సబ్సిడీలను కూడా పెంచే దిశగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. వీటితో పాటు పెట్రోల్, డీజిల్ లో రాష్ట్ర పన్ను వాటాను కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ సారి నిరుద్యోగ భృతి తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పైసలను పెంచే అవకాశం. రైతు బంధు కూడా ఎకరాకు రూ. 1000 పెంచాలని ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.

    వీటని మేనిఫెస్టోలో పెడితే తమను కొట్టే పార్టీ గానీ, వ్యక్తి గానీ లేడని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ నుంచి లీకులు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన మేనిఫెస్టో దాదాపు పూర్తయిందని, రేపో మాపో రిలీజ్ చేయవచ్చని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Political Love Triangle : తెలంగాణ ఎన్నికల్లో ట్రయాంగిల్ లవ్ డ్రామా.. 

    Political Love Triangle : మొదట్లో బాగా దూకుడుగా ఉన్న బీజేపీ...

    Rythu Bandhu Stop : రైతుబంధు వద్దు.. ఎన్నికల వేళ కాంగ్రెస్ చేస్తున్న పెద్ద తప్పు ఇదే..!

    Rythu Bandhu Stop : తెలంగాణలో ఎన్నికలకు మరో 35 రోజుల...

    Boss To Change Strategy : పస తగ్గిన ప్రసంగాలు.. స్ట్రాటజీ మార్చాల్సిందేనని బాస్ కు వినతులు

    Boss To Change Strategy : ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు...

    CM KCR Strategy : తెలంగాణ అంటే కేసీఆర్.. పక్కా వ్యూహంతో బరిలోకి

    CM KCR Strategy : తెలంగాణలో ఎన్నికలకు మరో 44 రోజుల...