
Guntur Karam teaser : త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న చిత్రానికి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల (మే) 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా టైటిట్ పెట్టడంతో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారట మేకర్స్. ఈ విషయాన్ని ఈ రోజు (మే 27 శనివారం) అధికారికంగా ప్రకటించారు.
టీజర్ విడుదలకు ముందే ఆసక్తి కరమైన విషయాలు బయటపడ్డాయి. ఇందులో మహేశ్ బాబును చాలా డిఫరెంట్ గా చూపిస్తున్నారట దర్శకుడు. ఆయనలో మాస్ యాంగిల్ చూడడం చాలా తక్కువనే చెప్పాలి. ఒకటి రెండు సినిమాల్లో తప్పించి అది అంతగా అది బయటకు రాలేదు. కానీ ఈ చిత్రంలో ఆయన పూర్తిగా మాస్ యాంగిల్ లో డిఫరెంట్ గా కనిపిస్తారని తెలిసింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
ఇక టీజర్ గురించి తెలుసుకుంటే పూర్తి నిడివి 47 సెకండ్లు మాత్రమే ఉంటుందట. ఇందులో ఒక మాస్ డైలాగ్, యాక్షన్ షాట్స్, ఇక మహేశ్ బాబు తొడగొడితే జీపులు పేలి కాలిలోకి లేచే యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. టీజర్ ఇప్పటికే పూర్తయిందని, ఒక మహేశ్ బాబు డబ్బింగ్ మాత్రమే మిగిలి ఉందని లీకులు వినిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా డబ్బింగ్ కూడా పూర్తి చేసి రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్తున్నారు.
ఈ సినిమాను వేగంగా పూర్తి చేసేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా కష్టపడ్డారట. ఈ చిత్రం మొదలు పెట్టగానే మహేశ్ బాబు వరుసగా ఇబ్బందులు ఎదర్కొన్నారు. మొదలు ఆయన అమ్మ చనిపోయింది. తర్వాత ఆయన నాన్న సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. ఈ రెండు ఘటనలు జరిగిన తర్వాత మహేశ్ బాబు ఫ్యామిలీ వెకేషన్ కు వెళ్లింది. ఇవన్నీ ముగించుకొని వచ్చే సరికి పవన్ కళ్యాణ్ తో స్ర్కిప్ట్ డిస్కర్షన్ లో పడ్డాడు డైరెక్టర్ ఇక సినిమా ఆగుతుందా అనుకున్న సమయంలో ఎలాగోలా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చేస్తామని నిర్వాహకులు తెలుపుతున్నారు.