
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు వారు అభిమానించే నటీనటుల వివరాలను తెగ సర్చింగ్ చేస్తున్నారు.. అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చిన నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. వీరు నివసించే ఇంటి దగ్గర నుండి సెలెబ్రిటీలు వాడే వస్తువుల గురించి ఏదొక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. వాటిలో వారి కార్ల కలెక్షన్ కూడా ఉంటుంది.
నేటితరం సెలెబ్రిటీలు కొత్త కొత్త న్యూ మోడల్స్ రాగానే కార్లు, బైక్స్ మారుస్తూనే ఉంటారు.. మరి ఈ మధ్య ఒక్కో స్టార్ ఒక్కో ఖరీదైన లగ్జరీ కార్లను కొంటున్నారు. ఇటీవలే మహేష్ బాబు ఐదున్నర కోట్ల ఖరీదైన కారును కొనగా ఈ వార్త నెట్టింట వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో అక్కినేని నాగార్జున కొత్త కారు కొన్నట్టు తెలుస్తుంది.
టాలీవుడ్ లో నాగార్జునకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు వరుస సూపర్ హిట్స్ తో మాస్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న నాగ్ ఈ మధ్య అంతగా హిట్స్ అందుకోలేక పోతున్నాడు. 63 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఫిట్ గా హ్యాండ్సమ్ గా కొడుకులకు సైతం పోటీ ఇచ్చేలా ఫిట్ నెస్ మైంటైన్ చేస్తున్నాడు.
ఈయన గత ఏడాది ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాభవం ఎదుర్కున్నాడు. ఇది పక్కన పెడితే ఈయన తాజాగా కొత్త కారు కొన్నట్టు తెలుస్తుంది. 70 లక్షల ఖరీదైన ఎలక్ట్రిక్ కారును నాగ్ కొనుగోలు చేయగా నాగ్-అమల కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతుంది. ఈవీ6 అనే న్యూ మోడల్ కారును ఈయన కొన్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కారు 528 కోలోమీటర్స్ వెళుతుందట. ఇది ఈ కారు స్పెషాలిటీ.