Natural Star Nani :
మన తెలుగు సినిమాల్లో భలే గమ్మత్తులు జరుగుతుంటాయి. మన పాత తరం హీరోలు ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేసి ఔరా అనిపించుకున్నారు. తెలుగు సినిమాల్లో ఎందరో నటులు ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేసిన వారున్నారు. అందులో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ ఘనతను చాటిన నేటి తరం హీరోల్లో నాని కూడా నిలిచాడు.
చిరంజీవి, బాలకృష్ణ ఆ రోజుల్లో ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేసిన ఘనతను సాధించారు. ఇప్పుడు అది సాధ్యం కాదు. కానీ ఆ ఘనత నేటి కాలంలో నిజం చేసుకున్న హీరో నాని ఒకరు మాత్రమే. ఆ రోజుల్లో చిరంజీవి, బాలకృష్ణ కాకుండా ఇంకా కొందరు హీరోలు కూడా ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేసి రికార్డులు సృష్టించారు.
ఎన్టీఆర్ 1959 జనవరి 14న ఒకే రోజు సంపూర్ణ రామాయణం, అప్పు చేసి పప్పు కూడు విడుదల చేశారు. సీతీ సులోచన, పెండ్లిపిలుపు సినిమాలు కూడా ఒకే రోజు మార్కెట్లోకి వచ్చాయి. 1968 జులై 19న సూపర్ స్టార్ కృష్ణ లక్ష్మీ నివాసం, పంతాలు, పట్టింపులు ఒకే రోజు రిలీజ్ చేశారు. 1984జనవరి 14న ఇద్దరు దొంగలు, యుద్ధం సినిమాలు ఒకే రోజు విడుదల చేశారు.
1980 సెప్టెంబర్ 19న చిరంజీవి కాళీ, తాతయ్య ప్రేమలీలలు ఒకే రోజు విడుదలయ్యాయి. 1982 అక్టోబర్ 1న టింగు రంగడు, పట్నం వచ్చిన పతివ్రతలు వచ్చాయి. 1993 సెప్టెంబర్ 3న బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు రావడం గమనార్హం. 2015 మార్చి 21న జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం రెండు సినిమాలు నానివి వచ్చాయి.
ఇలా తెలుగులో ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేసిన నటులు ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా రెండు సినిమాలు ఒకేసారి రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మన హీరోలు రెండు సినిమాలు ఒకే రోజు విడుదల చేయడం ఇప్పట్లో సాధ్యం కాదు.